close
Choose your channels

మిస్ యూనివర్స్ కిరీటం గెల్చుకున్న జోజిబిని టుంజీ

Monday, December 9, 2019 • తెలుగు Comments

దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబిని టుంజీ (26) ఈ ఏడాది విశ్వసుందరి (మిస్ యూనివర్స్)కిరీటం దక్కించుకుంది. అమెరికాలోని జార్జియా రాజధాని అట్లాంటాలో మొత్తం 90మంది ఈ పోటీలో పాల్గొనగా.. టుంజీని కిరీటం వరించింది. ఆదివారం రాత్రి తుది పోటీల్లో టుంజీని విజేతగా ప్రకటించడం జరిగింది. అందాల పోటీల్లో స్విమ్ సూట్, ఈవెనింగ్ గౌన్ రౌండ్లలో ఈ నల్లకలువ ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా టుంజీ మాట్లాడుతూ.. తనలాంటి శరీర ఛాయ కలిగిన స్త్రీలను అందాలభామలుగా పరిగణించని లోకంలో ఎదిగానన్నారు. చిన్నారులు తనను, తన వదనాన్ని చూడాలని కోరుకుంటానని.. వారు తమ ప్రతిబింబాలను తనలో చూడాలని కోరుకుంటానని ఆత్మవిశ్వాసంతో ఆమె చెప్పారు. టుంజీ మాటలు న్యాయనిర్ణేతలను మెప్పించాయి. ఇదిలా ఉంటే.. మిస్ మెక్సికో సోఫియా ఆరగాన్ రెండోస్థానానికి పరిమితమైంది. కాగా.. భారత్ నుంచి మిస్ యూనివర్స్ పోటీలకు వెళ్లిన మిస్ ఇండియా వర్తికా సింగ్ కనీసం టాప్-20లో కూడా స్థానం దక్కించుకోలేకపోవడం గమనార్హం.

Get Breaking News Alerts From IndiaGlitz