జగన్ ఆవిష్కరించిన డైరీ


Send us your feedback to audioarticles@vaarta.com


వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ పంచాయితీరాజ్ విభాగం డైరీ 2025ను ఆవిష్కరించారు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్. గ్రామ స్వరాజ్యం స్ధాపనకు గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, స్ధానిక సంస్ధల బలోపేతంతో పాటు ఆర్ధికంగా వాటిని స్వయంసమృద్ది దిశగా తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు జగన్.
స్ధానిక ప్రజాప్రతినిధులకు వైఎస్సార్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించిన జగన్, ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచుతామన్నారు. అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే కూటమి సర్కారు లెక్కలేనన్ని తప్పులు చేసిందంటున్నారు మాజీ ముఖ్యమంత్రి.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పంచాయితీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రరెడ్డి, వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మల్లాది విష్ణు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, మజ్జి శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ ఎంపీపీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మరకపూడి గాంధీ, కడప మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com