close
Choose your channels

YS Jagan: నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం తీపికబురు

Friday, December 8, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

YS Jagan: నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం తీపికబురు

ఏపీలో నిరుద్యోగులకు సీఎం జగన్ ప్రభుత్వం వరుస తీపికబురులు అందిస్తుంది. ఉద్యోగ జాతరకు శ్రీకారం చుట్టింది. ఒక్క రోజు వ్యవధిలోనే గ్రూప్-2, గ్రూప్‌-1 నోటిఫికేషన్ విడుదల చేసి సువర్ణాధ్యాయం లిఖించింది. గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 81 పోస్టులను ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఇందులో 9 డిప్యూటీ కలెక్టర్లు, 26 డీఎస్పీల పోస్టులు ఉన్నాయి.

నిరుద్యోగులు సంతోషం..

ఇక గ్రూప్-2కు సంబంధించి మొత్తం 897 గ్రూప్ -2 పోస్టులను భర్తీ చేయనుండగా.. ఇందులో 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ రాత పరీక్ష ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు డిసెంబర్ 21 నుంచి ప్రారంభం కానుండగా.. జనవరి 10 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. స్క్రీనింగ్ పరీక్ష ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు. దీంతో గ్రూప్స్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

6 లక్షల పోస్టుల నియామకం..

ఇప్పటివరకు జగన్ ప్రభుత్వంలో 6 లక్షల 16 వేల 323 పోస్టులను నియమించింది. మొత్తం 6 లక్షల ఉద్యోగాల్లో లక్షా 84 వేల 264 పోస్టులు రెగ్యులర్ ప్రాతిపదికన నియమించింది. 3 లక్షల 99 వేల 791 పోస్టులు ఔట్‌ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం జరిగింది. 19 వేల 701 పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో సాగింది. మరో 10 వేల 143 ఖాళీ పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతుంది. పలు యూనివర్శిటీల్లో 3,500 పోస్టులకు నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో గతంలో ఏ ప్రభత్వమూ చేయని విధంగా రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించింది.

YS Jagan: నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం తీపికబురు

ప్రతి ఇంటికి ఉద్యోగం..

ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వడం ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్ధిక పరిపుష్ఠి కలిగింది. చదువుకున్న ప్రతి విద్యార్ధి మంచి ఉద్యోగం చేయాలన్నదే జగన్‌ థ్యేయం. విద్యావ్యవస్థ బాగుంటేనే సమాజం తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది ఆయన నమ్మకం. అందుకే గతంలో ఏ ప్రభుత్వం ఖర్చు చేయని నిధులు విద్యకు కేటాయించారు. నాడు-నేడులో భాగంగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. ఆ విద్యా సంస్కరణల సత్ఫలితాలు ఇప్పుడు చూస్తున్నాం. అలాగే ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన చంద్రబాబు సర్కార్ వారిని నట్టేట ముంచింది. సుప్రీంకోర్టు తీర్పు సాకుతో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకేుండా మోసం చేసింది. అయితే జగన్ సీఎం అయ్యాక నిబంధనలు సడలించి సాధ్యమైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేశారు.

53,126 పోస్టులు భర్తీ..

టీడీపీ హయాంలో వైద్య ఆరోగ్య శాఖలో 1693 పోస్టులు మాత్రమే భర్తీ చేయగా.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విలేజ్ క్లినిక్‌లు మొదలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 50 నెలల్లో 53 వేల 126 పోస్టుల్ని భర్తీ చేసింది. వీరిలో 3,899 మంది స్సెషలిస్ట్ డాక్టర్లు, 2,088 మెడికల్ ఆఫీసర్లు, 13,540 ANM, గ్రేడ్3 పోస్టులతో కలిపి 19,527 పోస్టులు శాశ్వత ప్రాతిపదికన నియమాకాలు జరిగాయి. వీటితో పాటు 10,032 మంది MLHP, 6734 స్టాఫ్ నర్స్‌లు, 9,751 మంది పారా మెడికల్ సిబ్బంది, 3,303 క్లాస్-4 సిబ్బంది, 249 మంది డీఈవోలతో పాటు మెడికల్ కాలేజీల్లో నియమించిన 1582 ఉద్యోగులు, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 53,126 పోస్టులున్నాయి.

ఉద్యోగ విప్లవం అంటే ఇది..

టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం వేలల్లో పోస్టులు భర్తీ చేసి చంద్రబాబు చేతులు దులుపుకున్నారు. కానీ ఇచ్చిన హమీకి తగ్గకుండా సీఎం జగన్ ఆరున్నర లక్షల ఉద్యోగాల నియామకాలు చేసి రాష్ట్రంలో నూతన శకానికి నాంది పలికారు. కేవలం నాలుగన్నర పాలనలో 2.14 లక్షల శాశ్వత ఉద్యోగాలను కల్పించి చరిత్ర సృష్టించారు. ఉద్యోగ విప్లవం అంటే ఇది. యువతకు భరోసా ఇవ్వడం అంటే ఇది. మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి జగన్ నిరూపించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos