Telangana Women MLAs:తెలంగాణ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మహిళా అభ్యర్థులు వీరే..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ అసెంబ్లీలో ఈసారి మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. ఆదివారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో పది మంది మహిళలు గెలిచారు. కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్ఎస్ నుంచి నలుగురు మహిళలు గెలుపొందారు. గత అసెంబ్లీలో ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ఉండగా ఈసారి అదనంగా నలుగురు మహిళలు ఎన్నికయ్యారు. దీంతో మొత్తం పది మంది మహిళలు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థులుగా ములుగు నుంచి సీతక్క, వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ, కోదాడ నుంచి పద్మావతి రెడ్డి, నారాయపేట నుంచి చిట్టెం పర్ణికా రెడ్డి, పాలకుర్తి నుంచి యశస్విని రెడ్డి, సత్తుపల్లి నుంచి మట్టా రాగమయి విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ తరపున మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత, ఆసిఫాబాద్ నుంచి కోవ లక్ష్మీ, నర్సాపూర్ నుంచి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి గెలుపొందారు.
ఇక పాలకుర్తి నుంచి సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై యశస్విని రెడ్డి గెలిచి చరిత్ర సృష్టించారు. ఆమె వయసు కేవలం 26 సంవత్సరాలు కావడం విశేషం. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు పలు మార్లు మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లిని ఓడించడంతో యశస్విని పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతోంది. ఇక ములుగు నుంచి సీతక్క హ్యాట్రిక్ కొట్టగా.. మహేశ్వరం నుంచి రెండో సారి సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించి పట్టు నిలుపుకున్నారు. మొత్తానికి ఈసారి అసెంబ్లీలో మహిళా అభ్యర్థుల సంఖ్య పెరగడం శుభపరిణామని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout