close
Choose your channels

చిరు ‘లూసిఫ‌ర్‌’లో ఆ పాత్ర ఉండ‌దా..?

Monday, January 18, 2021 • తెలుగు Comments

చిరు ‘లూసిఫ‌ర్‌’లో ఆ పాత్ర ఉండ‌దా..?

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్’ రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే. సుజిత్ ఈ రీమేక్‌ను తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర‌తో పాటు నాలుగుపాత్ర‌లు క‌థ‌లో చాలా కీల‌కంగా ఉంటాయి. అందులో చిరు సోద‌రి పాత్ర ఒక‌టి. ఈ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తారు? అనేది సినీ వ‌ర్గాల్లో చర్చ‌గా మారింది. చాలా మంది హీరోయిన్స్ పేర్లు విన‌ప‌డ్డాయి. తాజా సమాచారం మేరకు నయనతార పాత్ర ఖాయమైంది. అలాగే స‌త్య‌దేవ్ పాత్ర కూడా ఖ‌రారైందని టాక్‌.

మిగిలిన రెండు పాత్ర‌ల్లో చిరంజీవి త‌మ్ముడి పాత్ర‌లో అభిజిత్ న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని అంటున్నారు. కాగా.. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ రైట్ హ్యాండ్‌గా న‌టించిన పృథ్వీరాజ్ పాత్ర‌ను తెలుగులో ఎవ‌రు చేస్తారు? అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. అల్లు అర్జున్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ స‌హా చాలా పేర్లే వినిపించాయి. అయితే చివ‌ర‌కు డైరెక్ట‌ర్ మోహ‌న్‌రాజా తెలుగులో ఆ పాత్ర‌ను తీసేశాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ వారంలోనే లూసిఫ‌ర్ తెలుగు రీమేక్ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మ‌వుతుందని సినీ వర్గాలు అనుకుంటున్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz