close
Choose your channels

మ‌రి దేవిశ్రీ స‌పోర్ట్ ఇస్తాడా?

Friday, September 22, 2017 • తెలుగు Comments

యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ ప్ర‌సాద్‌కి తొలి అవ‌కాశ‌మిచ్చి ప్రొత్స‌హించిన ఘ‌న‌త నిర్మాత ఎం.ఎస్‌.రాజుది. ఆయ‌న నిర్మించిన దేవి చిత్రం ద్వారా చిన్న వ‌య‌సులోనే సంగీత ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌య‌మ‌య్యాడు దేవిశ్రీ‌. ఆ సినిమా హిట్ అవ‌డంతో.. మ‌రిన్ని అవ‌కాశాలు వ‌చ్చాయి. ఆనందం చిత్రం బ్రేక్ ఇచ్చినా.. దేవిశ్రీ హ‌వా స్టార్ట్ అయ్యింది మాత్రం వ‌ర్షం సినిమాతోనే. ఈ సినిమా నిర్మాత కూడా ఎమ్మెస్ రాజునే.

ఆ త‌రువాత వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన నువ్వొస్తానంటే నేనొద్దాంటానా మ‌రో మ్యూజిక‌ల్ హిట్‌. అంటే.. దేవిశ్రీ కెరీర్ ఆరంభంలో ఎమ్మెస్ రాజు ప్రోత్సాహం చాలానే ఉంద‌న్న‌మాట‌. అలాంటి ఎమ్మెస్ రాజుకి త‌న‌యుడు అయిన సుమంత్ అశ్విన్ హీరోగా ప‌రిచ‌య‌మైతే.. విశేషంగా ఇప్ప‌టివ‌ర‌కు దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించ‌లేదు.

అయితే ఆ అవ‌కాశం హ్యాపీ వెడ్డింగ్ రూపంలో వ‌ర్క‌వుట్ అయ్యింది ఇప్పుడు. మ‌రి దేవిశ్రీ ప్ర‌సాద్‌కి ఎమ్మెస్ రాజు బ్రేక్ ఇస్తే.. ఇప్పుడు రాజు త‌న‌యుడు సుమంత్‌ కొత్త సినిమాకి దేవిశ్రీ త‌న మ్యూజిక్‌తో బ‌ల‌మైన‌ స‌పోర్ట్ ఇస్తాడా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

కొత్త ద‌ర్శ‌కుడు లక్ష్మ‌ణ్ కార్య ద‌ర్శ‌క‌త్వంలో యువీ క్రియేష‌న్స్‌, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హ్యాపీ వెడ్డింగ్‌ చిత్రంలో నాగ‌బాబు కుమార్తె నిహారిక హీరోయిన్‌గా న‌టించ‌నుంది. వ‌చ్చే నెల 4న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంది.

Get Breaking News Alerts From IndiaGlitz