close
Choose your channels

వందల కోట్లల్లో ఈ చిత్రాల పెట్టుబడి.. థర్డ్ వేవ్ వచ్చేలోపు వచ్చేస్తాయా..

Monday, June 28, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వందల కోట్లల్లో ఈ చిత్రాల పెట్టుబడి.. థర్డ్ వేవ్ వచ్చేలోపు వచ్చేస్తాయా..

కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా సినిమా రంగ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. చిన్న చిత్రాలు ఓటిటి వేదికల్ని వెతుక్కుంటున్నాయి. దీని వల్ల నిర్మాత సేఫ్ అయిపోతున్నప్పటికీ థియేటర్లని నమ్ముకున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. అయితే పెద్ద చిత్రాలు అటు ఓటిటిలోకి వెళ్లలేక ఇటు థియేటర్లలోకి రాలేక నిర్మాతలకు గుదిబండలుగా మారుతున్నాయి. థర్డ్ వేవ్ ప్రభావం ఉంటుందనే ఊహాగానాలు ఎక్కువవుతున్నాయి. ఒక వేళ అదే కనుక నిజమైతే ఈ చిత్రాలు ఎంత త్వరగా విడుదలైతే అంత మంచిది. లేకుంటే నిర్మాతలకు అదనపు భారం తప్పదు.

'ఆచార్య' త్వరగా రావయ్యా..

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ఓ పాట ఆ అంచనాలని డబుల్ చేశాయి. ఈపాటుకి ఎప్పుడో థియేటర్స్ లోకి వచ్చేసి ఉండాల్సిన ఈ చిత్రం కరోనా వల్ల డిలే అవుతోంది. చిరంజీవి సినిమా అంటే 100 కోట్లకు పైనే బిజినెస్ చేస్తుంది. అంటే పెట్టుబడి కూడా భారీగానే ఉంటుంది. ఈ చిత్ర విడుదల ఇంకా ఆలస్యం అయితే నిర్మాతకు భారం పెరుగుతుంది.

రాధే శ్యామ్

ప్రభాస్ నెక్స్ట్ పాన్ ఇండియా రిలీజ్ ఈ చిత్రమే. కోవిడ్ కారణంగా ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుంది అనేది క్లారిటీ లేదు. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ వాయిదా పడ్డ ఈ చిత్రం మరింత ఆలస్యం అయితే కష్టమే.

పుష్ప

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ పై కన్నేశాడు. సుకుమార్, బన్నీ హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. కరోనా ప్రభావం లేకుంటే ఈపాటి పుష్ప రిలీజ్ కు ముస్తాబవుతూ ఉండేది.

టక్ జగదీష్

సరిగ్గా ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరపడే టైంకి కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. నేచురల్ స్టార్ నాని, టక్ జగదీష్ టీం ఓటిటి రిలీజ్ కు ఆసక్తిగా లేరు. ఎలాగైనా థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనేది వారి ఆలోచన. మీడియం రేంజ్ సినిమా కనుక విడుదల ఆలస్యం బిజినెస్ పై ప్రభావం చూపుతుంది.

లవ్ స్టోరీ

కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ చిత్ర రిలీజ్ కూడా వాయిదా పడింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతు, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే విడుదల చేయాలనేది నిర్మాతల ఆలోచన. ఏపీలో కూడా థియేటర్స్ తెరుచుకుంటే ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకు వస్తామని నిర్మాతలు ఆల్రెడీ చెప్పారు.

అఖండ

బాలయ్య, బోయపాటి కాంబోకి ఉండే క్రేజే వేరు. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. బాలయ్య రోరింగ్ పెర్ఫామెన్స్ ని ఎంజాయ్ చేయాలంటే థియేటర్లే అసలైన వేదిక.

కేజిఎఫ్ 2

కెజిఎఫ్ తో హీరో యష్, దర్శకుడు ప్రశాంత్ నీల్ దేశవ్యాప్తంగా అభిమానులని సొంతం చేసుకున్నారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతటి సునామి సృష్టించింది. ఇప్పుడు కెజిఎఫ్ 2 కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. కానీ కరోనా వల్ల రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు.

ఆర్ఆర్ఆర్

బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. 350 కోట్ల బడ్జెట్. ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఎక్కువగా డిలే అవుతుండడం వల్ల బడ్జెట్ పెరుగుతోంది అని కూడా వార్తలు వస్తున్నాయి. కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు. ఈ ఏడాది ఈ చిత్ర రిలీజ్ కష్టమే అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.