close
Choose your channels

ఆర్టికల్‌ 370 అంటే ఏంటి..? కశ్మీర్‌కే ‘ప్రత్యేకం’గా ఎందుకిచ్చారు.?

Monday, August 5, 2019 • తెలుగు Comments

ఆర్టికల్ 370 భారతదేశ ప్రజలకు మన దేశ ప్రథమ ప్రధాని ఇచ్చిన చేదు మాత్ర అని చెప్పుకోవచ్చు. అప్పటి జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫిరెన్స్ నేత షేక్ అబ్దుల్లా భారత ప్రధాని నెహ్రూ మధ్య కుదిరిన చీకటి ఒప్పందమే ఈ ఆర్టికల్ 370. ముఖ్యంగా ప్రతి భారతీయుడు ఈ ఆర్టికల్ 370 అంటే ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ప్రత్యేక ప్రతిపత్తి జమ్మూ కాశ్మీర్ ఈ ఆర్టికల్ 370 కల్పిస్తుంది. భారతదేశంలో అందరికీ ఒక పౌరసౌత్వం ఉంటే జమ్మూ కాశ్మీర్ ప్రజలకు మాత్రం ఈ ఆర్టికల్ 370 ద్వారా రెండు పౌరసౌత్వాలు కల్పించబడ్డాయి. అంతేకాదు ఈ ఆర్టికల్ ప్రకారం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సెపరేట్ అజెండానే కాదు జెండా కూడా ఉంది.

నో ఆర్టీఐ..!
దేశంలో అన్ని రాష్ట్రాలకు 5 సంవత్సారాలకు ఎన్నికలు జరిగితే ఇక్కడ మాత్రం ఆరు సంవత్సారాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఆర్టికల్ 370 మూలంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారత దేశ సార్వభౌమాదికారాన్ని జాతీయ పతాకాన్ని జాతీయ చిహ్నాలను అవమానించినా ఎటువంటి నేరము కాదట. ఇదిలా ఉంటే.. సుప్రీంకోర్టు తీర్పులు ఈ రాష్ట్రంలో పనిచేయవు.. పార్లమెంటు చేసిన చట్టాలు ఇక్కడ కొన్ని ఏరియాలకే పరిమితం. జమ్మూ కాశ్మీర్‌లో ఉండే కాశ్మీరీ యువతి దేశంలో వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకుంటే ఆమెకు కాశ్మీరీ పౌరసత్వం రద్దవుతుంది. అదే పాకిస్థాన్ యువకుడిని పెళ్లిచేసుకుంటే మాత్రం పెళ్లి చేసుకున్న భర్తకు కాశ్మీరి పౌరసత్వం లభిస్తుంది. ఆర్టికల్ 370 మూలంగా ఆర్టీఐ (సమాచార హక్కు చట్టం) చట్టాలు ఇక్కడ పనిచేయవు. అసలు ఆర్టీఐ ఇక్కడ అప్లై చేయబడదు. మరీ ముఖ్యంగా కాగ్‌కు ఇక్కడ తనిఖీలు చేసే అధికారం లేనేలేదు.

మైనారిటీలకు ఇక ఇబ్బందులు తప్పినట్లే..!
జమ్మూ కాశ్మీర్  మహిళలపై సిరియా చట్టాలు అమలు చేయబడతాయి.. అక్కడి పంచాయితీలకు ఎటువంటి అధికారాలు లేవు. కాశ్మీర్లో మైనారిటీలకు (హిందువులు, సిక్కులు, బౌద్దులు) రాజ్యాంగ బద్దంగా రావాలిసిన 16% రిజర్వేషన్లు అమలు కావాడం లేదు. ఆర్టికల్ 370 మూలంగా వేరే రాష్ట్రానికి చెందిన పౌరులు ఎటువంటి భూ క్రయ విక్రయాలు చేయడానికి వీలు లేకుండా పోయింది. భారత పౌరసౌత్వం కోసం పాకిస్థానులు చాలా మంది ఇక్కడి అమ్మాయిలను వివాహం చేసుకుంటున్నారు. అయితే కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో మైనారిటీలకు ఇబ్బందులన్నీ తప్పి.. మంచి రోజులొచ్చినట్లేనని చెప్పుకోవచ్చు.

ఇవాళ్టితో పీడ విరగడైంది..!
అయితే సోమవారం అనగా ఆగస్ట్-05తో ఈ పరిస్థితులన్నీ మారిపోయాయి. ప్రస్తుతం కేంద్రంలో నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ ఈ ఆర్టికల్ 370 రద్దు చేసింది. పెద్దల సభ అయిన రాజ్యసభలో హోం మంత్రి అమిత్ ‘షా’ ఈ కీలక ప్రకటన చేశారు‌‌‌. 35A కూడా రద్దుకు కూడా అమిత్ షా నిర్ణయించి రాజ్యసభలో ప్రకటన చేశారు. ఇవాళ్టితో 370 ఆర్టికల్ ద్వారా ఇటువంటి భయంకరమైన ఆర్టికల్ 370  రద్దయ్యింది. దీంతో జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కోల్పోయింది. మరోవైపు 35A రద్దుతో  ప్రత్యేక సౌకర్యాలను కాశ్మీర్ కోల్పోయింది. కాగా ఇదివరకు ఆర్టికల్‌ 370 ద్వారా రక్షణ, విదేశీ, ఆర్థిక, కమ్యూనికేషన్‌ వ్యవహారాలు తప్ప మిగతా వాటిలో కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి ఉంటుందన్న విషయం తెలిసిందే.

Get Breaking News Alerts From IndiaGlitz