close
Choose your channels

వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో 'వాళ్ళిద్దరి మధ్య'

Friday, November 1, 2019 • తెలుగు Comments

వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో వాళ్ళిద్దరి మధ్య

'మనసంతా నువ్వే', 'నేనున్నాను', 'ఆట' వంటి హిట్ చిత్రాలు తీసిన దర్శకుడు వి.ఎన్. ఆదిత్య కొత్త చిత్రానికి "వాళ్ళిద్దరి మధ్య" అనే టైటిల్ ఖరారు చేశారు. విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ ఇందులో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు . వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు వి.ఎన్ ఆదిత్య మాట్లాడుతూ, " మంచి క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చే నిర్మాతతో ... మంచి కంటెంట్ ఉన్న కథతో పనిచేయడం ఆనందంగా ఉంది. ఆర్టిస్టుల ఎంపిక కోసం చాలా కసరత్తులు చేశాం . సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ గారి మేనల్లుడు విరాజ్ అశ్విన్ ఈ కథకు హీరోగా కరెక్టుగా కుదిరాడు . మా చిత్రం కథలో హీరోయిన్ అమెరికా నుండి వస్తుంది. సహజత్వానికి దగ్గరగా ఉండేలా అమెరికా నుండే హీరోయిన్ ని పిలిపించాం. అక్కడ చదువుకుంటున్నా కూడా తెలుగు బాగా మాట్లాడగలిగే నేహా కృష్ణ మా కథ నచ్చి ఈ చిత్రంలో చేయడానికి ఒప్పుకుంది. మా చిత్రం ద్వారా ఆమెని తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేయడం ఆనందంగా ఉంది. ప్రముఖ కెమేరామ్యాన్ పి.జి. విందా దగ్గర అసోసియేట్ గా పనిచేసిన ఆర్.ఆర్. కోలంచి ఈ చిత్రం ద్వారా కెమెరామేన్ గా పరిచయం చేస్తున్నాం . ఇద్దరు ప్రతినాయకులలాంటి హీరో హీరోయిన్ మధ్య జరిగే ప్రేమ కథ ఇది. మా పోస్టర్స్ లో కనిపిస్తున్న 'లోమా' అంటే ఏంటో , టైటిల్ కి వీళ్ళ కారెక్టర్లకి సంబంధం ఏంటి అనేది త్వరలోనే తెలియజేస్తాం" అని తెలిపారు.

నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ, " నిర్మాతగా నాకు ఇదే తొలి సినిమా. కథ వినగానే ఇంప్రెస్ అయిపోయాను . వీఎన్ ఆదిత్య గారు చాలా ఎక్సలెంట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా ఉంటుందీ చిత్రం. నిర్విరామంగా చిత్రీకరణ జరుపుతున్నాం. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ లో షూటింగ్ చేశాం . డిసెంబర్ మొదటి వారంలోపు సినిమా మొత్తం సిద్దమై పోతుంది " అని చెప్పారు

హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ " నా రెండవ చిత్రం వి.ఎన్.ఆదిత్య గారి దర్శకత్వంలో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన దగ్గరినుండి నేను చాలానేర్చుకుంటున్నా . దాదాపు 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు ఈ చిత్ర యూనిట్ అంతా కొత్తవాళ్ళైనా కూడా చాలా ప్రతిభ కనబరుస్తూ ఇష్టంతో చేయడం చూస్తే సంతోషంగా అనిపించింది. వ్యక్తిగతంగా ఎలాంటి ప్రేమ కథ లేని నాకే, ఈ స్టోరీ డైరెక్టర్ గారు చెప్తుంటే అద్భుతంగా అనిపించింది. చూసే మీకు ఇంకా చాలా నచ్చుతుంది అని ఆశిస్తున్నా" అన్నారు .

హీరోయిన్ నేహా చిత్ర విశేషాలు చెబుతూ, " తెలుగు చిత్ర పరిశ్రమలో నా మొదటి చిత్రం వేదాంశ్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ సంస్థతో, వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను పెరిగింది ఇక్కడే. చిన్నప్పటినుండి తెలుగు చిత్రాల్లోని సహజత్వాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ పెరగడంతో ఆప్పటినుండే నటనపై ఆసక్తి ఉండేది. తెలుగు చిత్రాల్లో ఏదో ఒక రోజు నటించాలి అనుకుంటూ అవకాశం కోసం ఎదురుచూస్తుండగా డైరెక్టర్ వి.ఎన్.ఆదిత్య గారిని సంప్రదించడం ,ఆయన తన చిత్రానికి హీరోయిన్ గా నన్ను ఎంచుకోవడం జరిగిపోయాయి. 50 రోజుల చిత్రీకరణలో భాగంగా ప్రతి ఒక్కరి దగ్గర కొత్త విషయాలు నేర్చుకున్నాను. ప్రతీ ఒక్కరికీ నచ్చే ప్రేమ కథ, మెచ్చే కథనంతో తెరకెక్కనున్న ఈ చిత్రం మీ అందరికి చాలా బాగా నచ్చుతుందనుకుంటున్నాను" అన్నారు.

తారాగణం : విరాజ్ అశ్విన్, నేహా కృష్ణ ,వెంకట్ సిద్ధారెడ్డి, బిందు చంద్రమౌళి, సాయి శ్రీనివాస్ వడ్లమాని, జయశ్రీ రాచకొండ, శ్రీకాంత్ అయ్యంగార్ , నీహారికా రెడ్డి, ప్రశాంత్ సిద్ది , సుప్రజ, కృష్ణ కాంత్, అలీ ,భార్గవ్, రామకృష్ణ తదితరులు.

Get Breaking News Alerts From IndiaGlitz