కీచక టీచర్ ని స్తంభానికి కట్టి మరీ దేహశుద్ధి


Send us your feedback to audioarticles@vaarta.com


మరో కీచక ఉపాధ్యాయుడు తెరపైకొచ్చాడు. బాలికను లైంగిక వేధింపులకు గురిచేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. స్తంభానికి కట్టి మరీ దేహశుద్ధి చేశారు స్థానికులు.
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి మండలం వడ్డాది గ్రామంలో ఎన్టీఎస్ స్కూల్ లో బాధిత బాలిక 9వ తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నాడు ప్రసాద్. ఎప్పట్నుంచి కన్నేశాడో కానీ, బాలికను వేధించడం మొదలుపెట్టాడు. అసభ్యంగా తాకడం, మాట్లాడ్డం మొదలుపెట్టాడు.
ఒక టైమ్ చూసి ఏకంగా బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో జరిగిన విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే తల్లిదండ్రులు స్కూల్ కు వెళ్లి ప్రసాద్ ను నిర్భంధించారు. దగ్గర్లో ఉన్న స్తంభానికి అతడ్ని కట్టి చితక్కొట్టారు. బాధాకరమైన విషయం ఏంటంటే, సదరు ఉపాధ్యాయుడి పిల్లలు కూడా బాధితురాలి వయసువాళ్లే. పైగా బాధిత విద్యార్థి క్లాస్ మేట్స్ కూడా.
జరిగిన ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. లైంగిక దాడికి పాల్పడిన టీచర్ ప్రసాద్ ను వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీచేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments