close
Choose your channels

డేట్ ఫిక్స్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి...!

Wednesday, January 6, 2021 • తెలుగు Comments

డేట్ ఫిక్స్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరి...!

టాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒక‌రైన విజ‌య్ దేవ‌ర‌కొండ.. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ త‌న మార్కు హీరోయిజంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఎలివేట్ చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే ముంబైలో కొంత మేర చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు ఆగింది. కోవిడ్ నేప‌థ్యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ స్టార్ హీరోలంద‌రూ షూటింగ్స్ స్టార్ట్ చేసినా.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పూరీ జ‌గ‌న్నాథ్ సినిమాను స్టార్ట్ చేయ‌లేదు. పూరీ జ‌గ‌న్నాథ్ ముంబైలో ఉండిపోయాడు. తాజా స‌మాచారం మేర‌కు.. వీరి కాంబినేష‌న్‌లో ప్రారంభం కానున్న సినిమా షూటింగ్ జ‌న‌వ‌రి 20 నుండి పునః ప్రారంభం కానుందట‌. ఈ షెడ్యూల్ పూర్త‌యిన త‌ర్వాత కొత్త షెడ్యూల్‌ను విదేశాల్లో ప్లాన్ చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది.

తెలుగులో పూరీ జ‌గ‌న్నాథ్‌, ఛార్మి నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని హిందీలో క‌ర‌ణ్ జోహార్ నిర్మిస్తున్నాడు. అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి ఫైట‌ర్ లేదా లైగ‌ర్ అనే రెండు టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్నట్లు స‌మాచారం.

Get Breaking News Alerts From IndiaGlitz