close
Choose your channels

క్రైమ్, పాలిటిక్స్, యాక్షన్ తో విజయ్ ఆంటోని 'విజయ రాఘవన్' ట్రైలర్

Monday, August 2, 2021 • తెలుగు Comments

క్రైమ్, పాలిటిక్స్, యాక్షన్ తో విజయ్ ఆంటోని విజయ రాఘవన్ ట్రైలర్

బిచ్చగాడు చిత్రంతో పాపులర్ అయిన విజయ్ ఆంటోని వైవిధ్యమైన కథలతో తెలుగు, తమిళ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. విజయ్ ఆంటోని నుంచి రాబోతున్న మరో చిత్రం 'విజయ రాఘవన్'. విజయ్ ఆంటోని, హాట్ బ్యూటీ ఆత్మిక జంటగా నటిస్తున్నారు. ఆనంద కృష్ణన్ ఈ చిత్రానికి దర్శకుడు.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ సారి విజయ్ ఆంటోని క్రైమ్ టచ్ ఉండే పొలిటికల్ కథని ఎంచుకున్నాడు. బస్తీల్లో ఉండే పేదవారు.. వారి సమస్యలని పొలిటీషియన్స్ ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారో ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

బస్తీలో పిల్లలకు ట్యూషన్ చెబుతూ ఐఏఎస్ చదివే యువకుడిగా విజయ్ ఆంటోని నటిస్తున్నాడు. పరిస్థితులు అతడిని ఎలా పాలిటిక్స్ వైపు నడిపించాయనేది కథ. ట్రైలర్ లో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, చేజింగ్ సీన్లు కూడా ఉన్నాయి. చక్కటి సందేశంతో, కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

నివాస్ కె ప్రసన్న ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ట్రైలర్ లో హీరోయిన్ పాత్రని పెద్దగా రివీల్ చేయలేదు. ఓట్ల కోసం వేలకోట్లు ఖర్చు చేసే రాజకీయ నాయకులని విజయ్ ఆంటోని ప్రశ్నిస్తున్న డైలాగులు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz