close
Choose your channels

Nayanthara : అలా ఎవ్వరూ చేయలేరేమో.. : నయనతారపై అత్తగారి కామెంట్స్

Monday, November 28, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సుదీర్ఘకాలం ప్రేమాయణం తర్వాత నయనతార, విఘ్నేష్ శివన్‌ల జోడీ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. జూన్ 9న మద్రాస్ సమీపంలోని మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో అతికొద్ది మంది సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే పెళ్లయిన కొద్దినెలలకే వీరిద్దరూ తల్లీదండ్రులయ్యారు. పండంటి ఇద్దరు మగ కవలలకు వీరు జన్మనిచ్చారు. పెళ్లయి 5 నెలలు కూడా కాలేదు. అప్పుడే వీరికి కవల పిల్లలు ఎలా కలిగారనే అనుమానంతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. చాలా మంది స్టార్స్ లాగానే సరోగసి విధానం ద్వారా విఘ్నేష్ శివన్, నయనతారలు తల్లీదండ్రులయ్యారు. ఈ విషయాన్ని విఘ్నేష్ శివన్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. తను, తన భార్య ఇద్దరు కవలలకు అమ్మానాన్నలం అయ్యామని.. చాలా ఆనందంగా వుందని, తమ జీవితంలో కొత్త చాప్టర్ మొదలైందంటూ.. భార్యాభర్తలిద్దరూ పసిబిడ్డల పాదాలకు ముద్దు పెడుతోన్న ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

నయన్ దంపతులకు తమిళ సర్కార్ క్లీన్ చీట్:

అయితే నయన్ దంపతులు అనుసరించిన సరోగసి విధానంపై విమర్శలు వెల్లువెత్తడంతో పాటు ఏకంగా తమిళనాడు ప్రభుత్వం కలగజేసుకుని విచారణకు సైతం ఆదేశించింది. ఈ విచారణలో నయనతార, విఘ్నేష్ శివన్‌లు నిబంధనలను ఉల్లంఘించలేదని తమిళ సర్కార్ క్లీన్ చీట్ ఇచ్చింది. దీంతో ఈ దంపతులు తమ చిన్నారులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలావుండగా తన కోడలు నయనతారపై విఘ్నేష్ అమ్మగారు మీనా కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పనిమనిషి అప్పు తీర్చేసిన నయనతార:

ఇటీవల ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... తన కొడుకు కోడలు ఎంతో కష్టపడి పనిచేస్తారని ప్రశంసించారు. తన కోడలు నయనతార బంగారమన్న ఆమె.. తన దగ్గర పనిచేసే వారి విషయంలోనూ ఎంతో కేర్ తీసుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలో తన సిబ్బందిలో ఒక మహిళకు రూ.4 లక్షలు అప్పు వుందని తెలుసుకున్న నయనతార.. తనే స్వయంగా బాకీ తీర్చిందని మీనా చెప్పారు. ఏదేమైనా తన కోడలు బంగారమని ఆమె ప్రశంసించారు. ప్రస్తుతం మీనా కుమార్ అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

చేతినిండా సినిమాలతో బిజీగా నయనతార:

ఇక సినిమా విషయానికి వస్తే.. ఇటీవల తెలుగులో నయనతార మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్‌లో నటించారు. ఈ సినిమా సూపర్‌హిట్ కావడం.. ఇప్పుడు ఇద్దరు కవలలకు జన్మనివ్వడంతో నయన్ ఫుల్ హ్యాపీగా వున్నారు. తనకు ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ఆమె అభిమానులకు థ్యాంక్స్ నోట్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నయనతార ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా వున్నారు. తమిళం, మలయాళంతో పాటు హిందీలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సరసన మరో సినిమాలోనూ ఆమె నటిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.