జగన్ పై విడదల రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు


Send us your feedback to audioarticles@vaarta.com


వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పై, ఆ పార్టీకి చెందిన నేత, మాజీ మంత్రి విడదల రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో జగన్ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. కేవలం 11 సీట్లకు మాత్రమే ఆయన పార్టీ పరిమితమైంది. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవడం ఘోర వైఫల్యం.
వీటిని దృష్టిలో పెట్టుకొని విడదల రజనీ స్పందించారు. ఎన్నికల్లో జనం ఎవ్వరూ జగన్ ను మోసం చేయలేదని, ఆయనే తనకుతానుగా మోసపోయాడని ఆమె అన్నారు. రజనీ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి.
ప్రజల్లో జగన్ పై ఇష్టం ఉన్నప్పటికీ.. పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాలు, సొంత పార్టీ మనుషులే జగన్ ఓటమికి కారణమయ్యారనే అర్థం వచ్చేలా విడదల రజనీ వ్యాఖ్యలున్నాయి. అయితే తన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటూ విడదల రజనీ ఓ వీడియో విడుదల చేశారు.
అందులో కొంతమంది మహిళలు, రజనీతో మాట్లాడుతున్నారు. తాము జగన్ కే ఓటేశామని, తమకు తెలిసిన చాలామంది జగన్ కే ఓటేశారని, తాము జగన్ ను మోసం చేయలేదని, ఈవీఎంలు మోసం చేశాయని ఆమె చెప్పే వీడియోను రజనీ పోస్ట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com