పవన్ మేనమామగా వెంకీ?


Send us your feedback to audioarticles@vaarta.com


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 25వ చిత్రం అజ్ఞాతవాసి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించింది. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతమందించారు. ఇటీవల విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన లభిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో సీనియర్ కథానాయకుడు విక్టరీ వెంకటేష్ ఓ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో పవన్ కల్యాణ్ మేనమామగా వెంకీ కనిపించనున్నాడని.. అతని పాత్ర లుక్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు ముచ్చటించుకుంటున్నాయి.
ఇక వెంకీకి జోడీగా నదియా కనిపించనుందట. అయితే.. వెంకీ అతిథి పాత్రపై చిత్ర బృందం ఇప్పటివరకు స్పందించనేలేదు. వెంకీ, పవన్ కాంబినేషన్లో వచ్చిన గోపాల గోపాల ఏ తేదిన విడుదలైందో అదే జనవరి 10న అజ్ఞాతవాసి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.