close
Choose your channels

అయ్యో.. చంద్రబాబు అనుకున్నదొక్కటి.. అయినదొక్కటీ!!

Tuesday, December 10, 2019 • తెలుగు Comments

అయ్యో.. చంద్రబాబు అనుకున్నదొక్కటి.. అయినదొక్కటీ!!ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచే వాడివేడీగానే సాగుతున్నాయి. అటు అధికార పార్టీ సభ్యుల విమర్శలు, కౌంటర్లు.. ఇటు ప్రతిపక్ష పార్టీ సభ్యుల ప్రతి విమర్శలు, కౌంటర్ ఎటాక్‌లతో రసవత్తరంగానే సాగుతోంది. అధికార పార్టీని ఇరుకున పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకో అవతారమెత్తుతున్నారు. సోమవారం నాడంతా ‘ఉల్లి ధరల పెంపు’పై పెద్ద హడావుడే చేశారు. ఇవాళ కూడా ‘రైతులకు గిట్టుబాటు ధరలు’ కల్పించాలంటూ ఇవాళ తనతో పాటు తన పార్టీకి చెందిన సభ్యులను సైతం పాదయాత్రగా అసెంబ్లీకి వెళ్లడం అక్కడ మార్షల్స్ అడ్డుకోవడం.. దీంతో సీబీఎన్ వర్సెస్‌ మార్షల్స్‌గా పరిస్థితులు ఏర్పడింది. ఇవాళ ప్రభుత్వాన్ని గట్టిగానే కడిగేయాలని పార్టీ సభ్యులకు గట్టిగానే టెలీ కాన్ఫరెన్స్‌లో చెప్పి మరీ సమావేశాలకు వెళ్లారు.

కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా..!
అయితే సమావేశాలకు వెళ్లీ వెళ్లగానే హడావుడి మొదలు పెట్టారు. ఈ క్రమంలో సమావేశాలు ప్రారంభం కాగానే అధ్యక్షా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ కోరగా ఆయనకు మొదటి చాన్స్ ఇచ్చారు స్పీకర్. అయితే ప్రశ్నోత్తరాలు కూడా ప్రారంభం కాక మునుపే వంశీకి స్పీకర్ అవకాశం ఇవ్వడంతో.. దేదో సామెత ఉంది కదా కోతికి కొబ్బరి చిప్ప దొరికిందన్నట్లుగా.. వంశీ చేతికి మైక్ దొరకడంతో.. చంద్రబాబు అండ్ కో బ్యాచ్‌ను తిట్టడం మొదలుపెట్టారు. ఇప్పటికే పలుమార్లు అటు టీడీపీకి చెందిన పలువురు సభ్యులు.. చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన వంశీ.. తాజాగా అదే అయ్యప్ప మాలలోనే మరోసారి తన నోటికి బుద్ధిచెప్పారు.!. ఇక అంతే సంగతులు.. నాన్ స్టాప్‌గా విమర్శలే.

ఉలిక్కిపాటెందుకు..!?
‘సీఎం జగన్‌ను కలవడంపై చంద్రబాబు ఎందుకు అభ్యంతరం తెలిపారు..? నేను సీఎంను కలిస్తే మీకు ఉలుకెందుకు?. మాకు హక్కులుండవా..? మేం కలవకూడదా..?. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే నేను జగన్‌ను కలిశాను. పప్పు అండ్ బ్యాచ్ నాపై దుష్ప్రచారం చేశారు. జయంతికి వర్థంతికి తేడా తెలియని వాళ్లు టీడీపీలో ఉన్నారు. నేను మాట్లాడుతుంటే సభ నుంచి చంద్రబాబు ఎందుకు లేచి వెళ్లిపోయారు..?. నాతో మాట్లాడకుండా నన్ను సస్పెండ్ ఎలా చేస్తారు..?. పప్పు బ్యాచ్‌, పొట్టిరాయుళ్లు, పొలావ్‌ పొట్లాళ్లగాళ్లతో నన్ను తిట్టించారు. అందుకే ఇక నేను టీడీపీలో ఉండలేను. నన్ను ప్రత్యేక ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి స్పీకర్ సార్’ అని రెక్వెస్ట్ చేశారు. అంతటితో ఆగని ఆయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గురించి మాట్లాడుతూ.. పేదల కోసం వైఎస్‌ ఎన్నో మంచి పథకాలు తీసుకొచ్చారని ఆయన సేవలను వంశీ గుర్తు చేశారు. ఈ క్రమంలో వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తించిన స్పీకర్.. మీకు ఇష్టం వచ్చిన కూర్చోవచ్చని అవకాశమిచ్చారు. మరోవైపు.. వంశీకి వైసీపీ ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు.

వంశీ పోయాక మళ్లీ వీళ్లొచ్చారే!
అయితే.. వంశీ మాట్లాడుతుండగానే చంద్రబాబుతో పాటు పలువురు విపక్ష పార్టీకి చెందిన సభ్యులు వాకౌట్ చేశారు. వంశీ మాట్లాడేసిన తర్వాత ఎప్పుడో మళ్లీ సభలోకి వచ్చారు. ఇకనైనా ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసుకుని మాట్లాడాలని బాబు భావించారు. అందుకే ఉల్లిపాయల కోసం క్యూలో నిల్చుని చనిపోయిన సాంబయ్య వ్యవహారం చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారు. సరిగ్గా చంద్రబాబు మాట్లాడుతుండగానే.. మంత్రి కొడాలి నాని, మంత్రి కురసాల కన్నబాబు రంగంలోకి దిగారు. అసలు ఆయన దేనికి చనిపోయారు..? మీరు చెబుతున్నదేంటి..? ‘ఆయన చనిపోయింది గుడివాడ.. అక్కడ నేనున్నాను అనే విషయం గుర్తుపెట్టుకోండి’ అని ఒకింత స్ట్రాంగ్ కౌంటరిచ్చే రీతిలో కొడాలి నాని మాట్లాడారు. అనంతరం కురసాల కన్నబాబు సైతం మాట్లాడుతూ కౌంటర్ ఎటాక్ చేశారు.

దీంతో ఇలా ఒకరు పోతే ఒకరు మంత్రులు మాట్లాడటం.. వీళ్లంతా పోనూ మధ్యలో సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. ఇలా వరుసగా మాట్లాడుతూ చంద్రబాబుకు ఉక్కిరి బిక్కిరి చేస్తుండటంతో ఏం చేద్దాం.. ఏం చేద్దాం అని ఆలోచనలో పడ్డారట. ఇలా ప్రతి ఒక్కటీ చంద్రబాబు అనుకున్నదొక్కటి.. తీరా చూస్తే అవుతున్నదొక్కటి. మరి మున్ముంథు చంద్రబాబు ఎన్నెన్ని ఎత్తులేస్తారో..? ఆయన ఎత్తులకు అధికార పార్టీ ఎన్నెన్ని పై ఎత్తులు వేస్తూ ఇలానే అసెంబ్లీ సాగిపోతుందో తెలియాలంటే సమావేశాలు పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz