close
Choose your channels

Valentines Day Special: వాలెంటైన్స్ డే స్పెషల్.. థియేటర్లలో రీరిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

Tuesday, February 13, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Valentines Day Special: వాలెంటైన్స్ డే స్పెషల్.. థియేటర్లలో రీరిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

ప్రతి ఏడాది ప్రేమికుల దినోత్సవంను లవర్స్ ఎంతో గ్రాండ్‌గా జరుపుకుంటారు. తమ ప్రియుడు, ప్రియురాలితో కలిసి ఆరోజు సంతోషంగా గడుపుతుంటారు. ఆ రోజును సంవత్సరమంతా తీపి గుర్తుగా ఉంచుకునేందుకు ప్లాన్స్ చేస్తూంటారు. అయితే ఈసారి మీ వాలంటైన్స్‌ డేను ప్రత్యేకంగా నిలిపేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ కూడా సిద్ధమైంది. ఇందులో భాగంగా గతంలో విడుదలై అభిమానులను అలరించిన ప్రేమ చిత్రాలు లవర్స్ డే రోజున మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. ఏయే సినిమాలు మిమ్మల్ని మళ్లీ కనువిందు చేయనున్నాయో తెలుసుకుందాం.

Valentines Day Special: వాలెంటైన్స్ డే స్పెషల్.. థియేటర్లలో రీరిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

ఓయ్!..

సిద్దార్థ్, షామిలి జంటగా నటించిన ఓయ్! చిత్రం. 2009లో విడుదలై మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. నూతన దర్శకుడు ఆనంద్ రంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటలు ఎవర్‌ గ్రీన్‌గా నిలిచిపోయాయి. యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతూనే ఉంది. సిద్దార్థ్ కెరీర్లో మైలురాయి చిత్రంగా ఉండిపోయింది. ఎంతో మందికి ఫేవరెట్ మూవీగా గుర్తుండిపోయింది. ఇప్పుడీ చిత్రాన్ని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

Valentines Day Special: వాలెంటైన్స్ డే స్పెషల్.. థియేటర్లలో రీరిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

సూర్య S/O కృష్ణన్..

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన ఈ సినిమా 2008లో విడుదలై యువతను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాను తెరకెక్కించిన విధానం అభిమానులను కట్టిపడేసింది. సూర్య తండ్రీకొడుకులుగా అద్భుతంగా నటించారు. సమీరా రెడ్డి, సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీలోని పాటలు కూడా ఎవర్ గ్రీన్‌గా ఉండిపోయాయి. గతేడాది ఆగస్టులో రీరిలీజ్ చేయగా మళ్లీ ఇప్పుడు వాలండైన్స్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

Valentines Day Special: వాలెంటైన్స్ డే స్పెషల్.. థియేటర్లలో రీరిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

తొలిప్రేమ..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ నటించిన 'తొలిప్రేమ' చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లవర్ బాయ్‌గా ఇందులో పవన్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. దర్శకుడు కరుణాకరణ్‌ మేకింగ్‌ కూడా అప్పటి యూత్‌కు విపరీతంగా నచ్చేసింది. మూవీ విడుదలై 25 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దక్కలేదు. మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయింది.

Valentines Day Special: వాలెంటైన్స్ డే స్పెషల్.. థియేటర్లలో రీరిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

సీతారామం..

హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా 2022లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. భారత్‌-పాక్ నేపథ్యంలో తెరకెక్కించిన ప్రేమకథకు ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ అదిరిపోయింది. ముఖ్యంగా మృణాల్ హావభావాలు, నటన కుర్రకారును ఊపేసింది.

Valentines Day Special: వాలెంటైన్స్ డే స్పెషల్.. థియేటర్లలో రీరిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

బేబీ..

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ సినిమా గతేడాది విడుదలై బ్లాక్‌బాస్టర్ విజయం అందుకుంది. మూవీ కథ యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. సాయి రాజేశ్ దర్శకత్వం సినిమాను వేరే లెవల్‌కి తీసుకెళ్లింది. ఇప్పుడీ సినిమాను ప్రేమికుల రోజు కానుకగా రీరిలీజ్ చేస్తున్నారు.

Valentines Day Special: వాలెంటైన్స్ డే స్పెషల్.. థియేటర్లలో రీరిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

నువ్వొస్తానంటే నేనొద్దంటానా..

సిద్దార్థ్, త్రిష జంటగా నటించిన ఈ సినిమా 2005లో విడుదలై సూపర్‌ హిట్ అయింది. కోటిశ్వరుడైన హీరో తన ప్రేయసి కోసం పల్లెటూరికి వెళ్లి వ్యవసాయం చేయడం.. అందులో కష్టాలు పడి నెగ్గడం ఎంతో బాగా చూపించారు. ప్రభుదేవా తొలిసారి డైరెక్ట్ చేసిన ఈ మూవీ కూడా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.

కాగా తెలుగు ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకున్న ఈ సినిమాలను మరోసారి వెండతెరపై చూసేందుకు సిద్ధం అవ్వండి. మూవీ టికెట్ల కోసం బుక్ మై షో, పేటీఎం తదితర బుకింగ్ యాప్‌లను సందర్శించవచ్చు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.