close
Choose your channels

‘వ‌కీల్ సాబ్’‌... ప‌వ‌న్ పూర్తి చేశాడు

Wednesday, December 30, 2020 • తెలుగు Comments

వ‌కీల్‌సాబ్‌..ఇటు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు, అటు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఓపెద్ద టెన్ష‌న్ తీరింది. ‘వ‌కీల్ సాబ్’ సినిమా కోసం ప‌వ‌న్ చాలా త‌క్కువ రోజులే కాల్షీట్స్ ఇచ్చాడు. సినిమాను తొందరగానే ముగించేయాల‌ని ద‌ర్శ‌కుడు వేణు శ్రీరామ్‌, నిర్మాత‌లు అనుకున్నారు. కానీ కోవిడ్ ఎఫెక్ట్‌తో సినిమా ఆరేడు నెల‌లు ఆగిపోయింది. ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి మ‌ళ్లీ రీసెంట్‌గానే షూటింగ్‌ను స్టార్ట్‌చేసింది యూనిట్ ఏదైతేనేం చాలా త్వ‌ర‌త్వ‌ర‌గా సినిమాను పూర్తి చేసుకుంటూ వ‌చ్చారు. ముఖ్యంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను త్వ‌ర‌గానే పూర్తి చేసేశారు. ‘వ‌కీల్ సాబ్’ చిత్రంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ పాత్ర‌కు సంబంధించి షూటింగ్ పార్ట్ పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలియ‌జేసింది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో ఉన్న ఫొటోను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది.

బాలీవుడ్ సినిమా ‘పింక్‌’కు రీమేకే ‘వ‌కీల్ సాబ్’. ప‌వ‌న్‌క‌ల్యాణ్ లాయ‌ర్‌గా న‌టిస్తున్నాడు. ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన లుక్ కూడా విడుద‌లైంది. శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో అంజ‌లి, నివేదా థామ‌స్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కొత్త ఏడాది సంద‌ర్భంగా సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల తేదీపై క్లారిటీ వ‌స్తుంది. ఈ చిత్రాన్ని దిల్‌రాజు, బోనీ క‌పూర్ నిర్మిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz