close
Choose your channels

బిగ్‌బాస్-3 హౌస్‌లోకి ఊహించని కంటెస్టెంట్స్...!

Saturday, July 20, 2019 • తెలుగు Comments

బిగ్‌బాస్-3 హౌస్‌లోకి ఊహించని కంటెస్టెంట్స్...!

తెలుగులో రెండు సీజన్లు విజయవంతం చేసుకున్న బిగ్‌బాస్ షో.. త్వరలో మూడో సీజన్‌ను ప్రారంభించబోతోంది. ఇప్పటికే ఈ షోకు వ్యాఖ్యతగా.. ‘మా’ టీవీ యాజమాన్యానికి అత్యంత నమ్మకస్తుడు.. టాలీవుడ్ మన్మథుడు అయిన అక్కినేని నాగార్జున అని అధికారికంగా ప్రకటన వెలువడిన విషయం విదితమే. అయితే ఇక మిగిలిందల్లా బిగ్‌బాస్ కంటెస్టెంట్లు మాత్రమే. ఇప్పటి వరకూ హౌస్‌లోకి అడుగుపెట్టే ఆ 15 మంది ఎవరన్న దానిపై మాత్రం సస్పెన్స్ వీడట్లేదు.

మరోవైపు ఇదిగో వీళ్లే హౌస్ వెళ్లేది.. లిస్ట్ వచ్చేసిందోచ్.. అంటూ వెబ్‌సైట్లు, యూట్యూబ్‌లలో పెద్ద ఎత్తు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆ బిగ్‌బాస్‌-2 షోకు వెళ్లొచ్చిన నూతన నాయుడు ఓ వీడియో షేర్ చేసి 15 మంది కంటెస్టెంట్ల లిస్ట్‌ను లీక్ చేశాడు.
 
ఊహించని కంటెస్టెంట్స్ వీళ్లే..!

01. నటి హేమ
02. యాంకర్ శ్రీముఖి
03. తీన్‌మార్ సావిత్రి
04. హిమజ
05. వరుణ్ సందేశ్
06. వితికా శేరు
07. సీరియల్ యాక్టర్ రవికృష్ణ
08. సీరియల్ యాక్టర్ అలీ రేజా
09. టీవీ9 యాంకర్ జాఫర్
10. నటి పునర్నవి
11. కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్
12. సింగర్ రాహుల్ సిప్లిగంజ్
13. యూట్యూబ్ కామెడీ స్టార్ మహేష్
14. సీరియల్ నటి రోహిణి
15. అశు రెడ్డి..

వాస్తవానికి ఇప్పటికే పలు జాబితాలు రిలీజ్ అవ్వగా.. వీరిలో కొందరు మాత్రమే ఉన్నారు. అయితే తాజా జాబితాలో మాత్రం ఊహించని వ్యక్తులున్నారు. ఈ జాబితా ఎంతవరకు నిజం అవుతుందో మరి. ఇక ఈ కంటెస్టెంట్ల విషయం అధికారికంగా తేలేదాకా.. ఇవాళ సాయంత్రం ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.

Get Breaking News Alerts From IndiaGlitz