close
Choose your channels

బిగ్‌బాస్ 5 తెలుగు: ఉమా దేవి ఎలిమినేషన్.. ఒక్కొక్కరి గురించి 'కుండ' బద్ధలు కొట్టింది

Monday, September 20, 2021 • తెలుగు Comments

బిగ్‌బాస్ 5 తెలుగు: ఉమా దేవి ఎలిమినేషన్ .. ఒక్కొక్కరి గురించి కుండ బద్ధలు కొట్టింది

ఎప్పటిలానే గ్రాండ్ ఇచ్చేశారు కింగ్ నాగార్జున. 'లాహే లాహే' సాంగ్ కి డాన్స్ చేసి అలరించారు. ఎలిమినేషన్ రౌండ్ ఉన్నప్పటికీ హౌస్‌లో కంటెస్టెంట్‌లను అమ్మాయిలు, అబ్బాయిల మధ్య డాన్స్ కాంపిటిషన్ పెట్టారు.

ముందుగా షణ్ముఖ్-ఉమాదేవి కలిసి 'మైండ్ బ్లాక్' సాంగ్ కి డాన్స్ చేశారు.
లహరి-జెస్సీ కలిసి 'స్వింగ్ జరా' సాంగ్ కి డాన్స్ చేశారు.
కాజల్-లోబో కలిసి 'భీమవరం బుల్లోడా' సాంగ్ కి డాన్స్ చేశారు.
శ్వేతవర్మ-వీజే సన్నీ కలిసి 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' సాంగ్ కి డాన్స్ చేశారు.
ప్రియా-యాంకర్ రవి కలిసి 'లక్ష్మీ బావా' సాంగ్ కి డాన్స్ చేశారు.
|హమీద-శ్రీరామచంద్ర కలిసి 'లంచ్ కి వస్తావా.. మంచ్ కొస్తావా..' అనే సాంగ్ కి డాన్స్ చేశారు.
ప్రియాంక-మానస్ కలిసి 'నచ్చావే నైజాం పోరీ' సాంగ్ కి డాన్స్ చేశారు.
యానీ మాస్టర్-విశ్వ కలిసి 'జ్వాలారెడ్డి' సాంగ్ కి డాన్స్ చేశారు.
నటరాజ్ మాస్టర్-సిరి కలిసి 'గరం గరం చిలకా' సాంగ్ కి డాన్స్ చేశారు.

ఈ జంటలలో ఎక్కువగా అబ్బాయిలే ఎక్కువ మార్కులు కొట్టేశారు. ఓవరాల్‌గా అబ్బాయిలకు ఎక్కువ పాయింట్లు వచ్చినప్పటికీ బిగ్‌బాస్‌ మాత్రం అమ్మాయిలు గెలిచినట్లు ప్రకటించి మేల్‌ కంటెస్టెంట్లకు షాకిచ్చాడు. మొత్తం నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిలో నిన్నటి ఎపిసోడ్ లో ముగ్గురు సేఫ్ అయ్యారు. మిగిలిన కంటెస్టెంట్స్ నటరాజ్ మాస్టర్, కాజల్, ఉమాదేవి, ప్రియాలలో ముందుగా కాజల్ సేఫ్ అయినట్లు అనౌన్స్ చేశారు. అనంతరం కాజల్.. తనకు మటన్ బిరియాని తినాలనుందని నాగార్జునను అడిగింది. దానికి వండుకొని తినమని నాగార్జున కాసేపు కాజల్ ని ఏడిపించారు. ఆ తరువాత కాజల్ అడిగింది కాబట్టి మటన్ బిరియాని పంపిస్తానని చెప్పారు. తర్వాత.. నాగ్‌.. ఇంటిసభ్యులతో 'ఇంట్లో ఉన్న దెయ్యం' ఆట ఆడించాడు. ఇంట్లో మీరెవరిని దెయ్యమని ఫీల్ అవుతున్నారో వాళ్లకి దెయ్యం స్టిక్కర్ అంటించాలని చెప్పారు.

బిగ్‌బాస్ 5 తెలుగు: ఉమా దేవి ఎలిమినేషన్ .. ఒక్కొక్కరి గురించి కుండ బద్ధలు కొట్టింది

ముందుగా ప్రియా.. సిరికి స్టిక్కర్ అంటిస్తూ నైట్ టైమ్ సరిగ్గా పడుకోదని, నేను పడుకున్న తరువాత వచ్చి మాట్లాడుతూ ఉంటుందని అన్నారు. మానస్-శ్రీరామచంద్రకు దెయ్యం స్టిక్కర్ అంటిస్తూ.. టాస్క్ లో అతడి ప్రవర్తన నచ్చలేదని చెప్పాడు. లహరి-ఉమాదేవి గట్టిగా మాట్లాడుతుందని 'స్వీట్ రాక్షసి' అంటూ స్టిక్కర్ అంటించింది. హమీద-యానీ మాస్టర్ కి స్టిక్కర్ అంటించింది. శ్రీరామచంద్ర-మానస్ ఓటమిని తీసుకోలేకపోతున్నాడని అతడికి దెయ్యం స్టిక్కర్ అంటించాడు. యాంకర్ రవి- శ్రీరామచంద్రకు దెయ్యం స్టిక్కర్ అంటించాడు. వీజే సన్నీ-ప్రియాంకకు దెయ్యం స్టిక్కర్ అంటిస్తూ.. గేమ్ లో తన కాళ్లు పట్టుకొని లాగేసింది ఫన్నీ రీజన్ చెప్పాడు.

విశ్వ- కాజల్ కి అంటిస్తూ.. దెయ్యంలాగా నా వెంట పడుతుందంటూ రీజన్ చెప్పాడు. ప్రియాంక- లోబోకి దెయ్యం స్టిక్కర్ అంటించింది. జెస్సీ- సిరికి దెయ్యం స్టిక్కర్ అంటించాడు. శ్వేతావర్మ- టాస్క్ లో సిరితో హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయిందని.. ఆమెకి దెయ్యం స్టిక్కర్ అంటించింది. యానీ మాస్టర్- హమీదకు దెయ్యం స్టిక్కర్ అంటించింది. కాజల్- విశ్వకు స్టిక్కర్ అంటిస్తూ.. నన్ను టార్గెట్ చేస్తున్నాడనిపిస్తుందని చెప్పుకొచ్చింది. సిరి- ఉమాదేవికి స్టిక్కర్ అంటిస్తూ కొన్ని విషయాల్లో ఆమె రాజీ పడడం లేదని చెప్పింది. నటరాజ్- విశ్వకు స్టిక్కర్ అంటిస్తూ టాస్క్ లో విశ్వ బిహేవియర్ ను రీజన్ గా చెప్పారు. షణ్ముఖ్- సన్నీ విషయంలో తప్పు చేశానంటూ తనకు తానే స్టిక్కర్ అంటించుకోగా.. అలా కుదరదని నాగ్ చెప్పగా.. సిరికి స్టిక్కర్ పెట్టాడు. ఉమాదేవి- సిరికి స్టిక్కర్ అంటించింది. లోబో- సిరికి స్టిక్కర్ అంటిస్తూ ఏదైనా ఉంటే టక్కున బయటకు చెప్తుంది కానీ అదే మనం చెప్తే తీసుకోలేదని రీజన్ చెప్పాడు.

బిగ్‌బాస్ 5 తెలుగు: ఉమా దేవి ఎలిమినేషన్ .. ఒక్కొక్కరి గురించి కుండ బద్ధలు కొట్టింది

నామినేషన్స్ లో మిగిలిన ముగ్గురు నటరాజ్,ప్రియా, ఉమాదేవిలలో ముందుగా ప్రియా సేఫ్ అయింది. ఆ తరువాత నటరాజ్, ఉమాదేవిలకు టాస్క్ ఇచ్చి వారిద్దరిలో నటరాజ్ మాస్టర్ సేఫ్ కాగా.. ఉమాదేవి ఎలిమినేట్ అయినట్లు అనౌన్స్ చేశారు నాగార్జున. ఉమ వెళుతుంటే లోబో ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకునే ప్రయత్నం చేశాడు. అనంతరం రవి పుట్టిన రోజును పురస్కరించుకుని తన భార్య పంపిన లెటర్‌ చదివి ఎమోషనల్‌ అయ్యాడు. అలాగే తనకు గిఫ్ట్‌ ఇచ్చిన ఉంగరాన్ని ముద్దాడాడు. స్టేజ్‌పైన ఒక్కొ కంటెస్టెంట్‌ గురించి చెప్పింది ఉమా దేవి. దీంతో హౌస్‌లో ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz