close
Choose your channels

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ప్రమాణం.. ఈయనే ఫస్ట్!

Thursday, November 28, 2019 • తెలుగు Comments

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ప్రమాణం.. ఈయనే ఫస్ట్!

మహారాష్ట్రలో అనేక ట్విస్ట్‌ల.. నాటకీయ పరిణామాల అనంతరం కొత్త సీఎంగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. ఛత్రపతి శివాజీ విగ్రహానికి నమస్కరించి అనంతరం థాక్రే ప్రమాణం చేశారు. గురువారం సాయంత్రం ముంబైలోని శివాజి పార్కు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి వేదికైంది. గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ.. ఉద్ధవ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా థాక్రే కుటుంబం నుంచి తొలి ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ప్రమాణం చేయడం విశేషం. మహారాష్ట్ర 18వ సీఎంగా ఇవాళ ఆయన ప్రమాణం చేశారు. ఉద్దవ్‌తో పాటు ఆరుగురు కీలక నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

మంత్రులుగా ప్రమాణం చేసింది వీళ్లే..

ఏక్‌నాథ్ పాండే (ఉద్దవ్ రైట్ హ్యాండ్)
సుభాష్ దేశాయ్ (శివసేన)
ఛగన్ భుజబల్ (కాంగ్రెస్)
జయంత్ పాటిల్ (కాంగ్రెస్)
బాలా సాహెబ్ థోరట్ (కాంగ్రెస్)
నితిన్ రావత్ (కాంగ్రెస్)

ప్రముఖులు హాజరు..
కాగా ఈ కార్యక్రమానికి.. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. మహా వికాస్ అఘాడీ కూటమిలోని పార్టీల ప్రముఖులందరూ హాజరయ్యారు. శివసేన కార్యకర్తలు, అభిమానులు తదితర నేతలు హర్ష ద్వానాల మధ్య ఉద్దవ్, మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా కనీస ఉమ్మడి ప్రణాళికను ‘మహా వికాస్ అఘడి కూటమి’ విడుదల చేసింది. తక్షణమే రైతులకు రుణమాఫీ అమలు చేయనుంది. స్థానికులకే 80 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని సర్కార్ హామీ ఇచ్చింది.

Get Breaking News Alerts From IndiaGlitz