close
Choose your channels

మహేష్ మూవీకి స్పెష‌ల్ సాంగ్స్‌ను సిద్ధం చేసిన దేవిశ్రీ

Saturday, November 9, 2019 • తెలుగు Comments

మహేష్ మూవీకి స్పెష‌ల్ సాంగ్స్‌ను సిద్ధం చేసిన దేవిశ్రీ 

సాధార‌ణంగా ఇప్ప‌టి సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్ అనైనా అనండి.. స్పెష‌ల్ సాంగ్స్ అనైనా అనండి.. ఓ సాంగ్ కామ‌న్‌గా ఉంటూ వ‌స్తుంది. ముఖ్యంగా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్ ప‌క్కా ఉండాల్సిందే. కానీ అనిల్ రావిపూడి స్టైల్ మార్చాడ‌ట‌. మ‌హేశ్‌తో అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న చిత్రం `స‌రిలేరునీకెవ్వ‌రు` చిత్రంలో రెండు స్పెష‌ల్ సాంగ్స్ ఉండేలా చూసుకున్నాడు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ కూడా రంగ‌స్థ‌లం త‌ర్వాత అనుకున్న స్థాయిలో మ్యూజిక‌ల్ హిట్ అందుకోలేదు. ఎలాగైనా మ‌రో మ్యూజిక‌ల్ హిట్‌ను కొట్టి ట్రాక్ ఎక్కాల‌నుకుంటున్నాడ‌ట‌. ఓ హుక్‌లైన్‌తో స్పెష‌ల్ సాంగ్స్‌ను కంపోజ్ చేసే దేవిశ్రీ మ‌హేశ్ కోసం రెండు హుక్ లైన్స్‌ను సిద్ధం చేసుకుని రెండు స్పెష‌ల్ సాంగ్స్‌ను సిద్ధం చేశాడ‌ట‌. ఓ స్పెష‌ల్ సాంగ్‌లో త‌మ‌న్నా న‌టిస్తుండ‌గా.. మ‌రో స్టార్ హీరోయిన్ మ‌రో స్పెష‌ల్‌సాంగ్‌లో క‌నువిందు చేయ‌నుంద‌ని టాక్‌.

ఇప్ప‌టికే 80 శాతం పైగా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ప్రొఫెస‌ర్ భార‌తి అనే లెక్చ‌ర‌ర్ పాత్ర‌లో విజ‌య‌శాంతి క‌మ్ బ్యాక్ అవుతున్నారు. మ‌హేశ్ 26వ చిత్ర‌మిది. మ‌హ‌ర్షి త‌ర్వాత మ‌హేశ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాల‌ను నెల‌కొన్నాయి. సినిమాను వ‌చ్చే సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. అనిల్ సుంక‌ర‌, దిల్‌రాజుతో పాటు మ‌హేశ్ కూడా ఈ సినిమా నిర్మాణంలో పార్ట్ అయ్యాడు.

Get Breaking News Alerts From IndiaGlitz