close
Choose your channels

తివిక్రమ్ ఎన‌ర్జీ చూపించనున్నాడా..?

Monday, October 26, 2020 • తెలుగు Comments

తివిక్రమ్ ఎన‌ర్జీ చూపించనున్నాడా..?

మాట‌ల మాంత్రికుడు, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో సినిమా చేయ‌డానికి హీరోలంద‌రూ ఆస‌క్తి చూపిస్తుంటారు. ఈ ఏడాది సంక్రాంతికి ‘అల వైకుంఠ‌పురుమ‌లో’ చిత్రంతో భారీ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు త్రివిక్ర‌మ్‌. త‌దుప‌రి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయ‌బోతున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించేశారు. కానీ త్రివిక్ర‌మ్ స్పీడుకు క‌రోనా వైర‌స్ బ్రేకులేసింది. ఎందుకంటే.. యంగ్ టైగ‌ర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ట్రిపుల్ ఆర్ చిత్రంలో కొమురం భీమ్ పాత్ర‌ను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యితే కానీ.. మ‌రో సినిమాను ఎన్టీఆర్ మొద‌లుపెట్టడానికి వీలులేదు. రీసెంట్‌గానే ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ అయ్యింది. పూర్తి కావ‌డానికి స‌మ‌యం ప‌ట్టేలానే ఉంది.

మ‌రోవైపు జ‌న‌వ‌రి నుండి గురూజీ ఖాళీగానే ఉంటున్నారు. ఇంకా వెయిటింగ్‌లో ఉండాల్సిన ప‌రిస్థితి అందుక‌నే త్రివిక్ర‌మ్ ఓ ప్లాన్ చేశాడ‌ట‌. గ్యాప్‌లో సినిమాను త్వ‌ర‌గా పూర్తి చేసెయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. ఈ కోవ‌లో త్రివిక్ర‌మ్ హీరో రామ్‌తో సినిమా చేయ‌డానికి రెడీ అయిన‌ట్లు సినీ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి. రామ్ కూడా సినిమా చేయ‌డానికి ఓకే చెప్పిన‌ట్లు, త్రివిక్ర‌మ్ స్క్రిప్ట్‌కు పైన‌ల్ ట‌చ్ ఇస్తున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఏడాదిలోపు సినిమాను పూర్తి చేసి విడుద‌ల చేసేలా ప్లాన్స్ చేస్తున్నాడ‌ని టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

Get Breaking News Alerts From IndiaGlitz