close
Choose your channels

బీ అల‌ర్ట్ అంటున్న టాలీవుడ్ స్టార్స్‌...

Tuesday, February 20, 2018 • తెలుగు Comments

టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా.. మోసాలు చేసే వారు కూడా అంతే తెలివిగా మోసం చేసేస్తున్నారు. ముఖ్యంగా సైబ‌ర్ క్రైమ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటువంటి నేరాల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంపొందించ‌డానికి హైద‌రాబాద్ సైబ‌ర్ పోలీసు శాఖ సినీ సెల‌బ్రిటీల స‌హాయం తీసుకున్నారు.

వీరితో అవ‌గాహ‌న స‌మాచారం చెప్పిస్తే ప్ర‌జ‌ల్లో వాటి ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని భావించి ఐదు షార్ట్ ఫిలింల‌ను విడుద‌ల చేసింది పోలీసు శాఖ‌. అందులో ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళితో ఆన్ లైన్ జాబ్‌లో జ‌రుగుతున్న మోసాల గురించి.. హీరో ఎన్టీఆర్‌తో ఆన్‌లైన్‌లో అమ్మాయిల‌పై జ‌రుగుతున్న దుశ్చ‌ర్య‌లు గురించి.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ప‌రిచ‌యం లేని వారి మాట‌లు న‌మ్మి ఆన్ లైన్‌లో డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌వ‌ద్దంటూ.. ఆన్ లైన్ మ్యాట్రిమోని మోసాలు గురించి నిఖిల్ సిద్ధార్థ్‌తో అవ‌గాహ‌న పెంపొందించే షార్ట్ ఫిలింస్‌ను విడుద‌ల చేశారు.

ప్రసాద్‌ ఫిల్మ్‌ లాబ్స్‌ లో సోమవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ వీవీ శ్రీనివాస రావు, స్వాతి లక్రా, నిర్మాత దిల్‌ రాజు, నటి సుప్రియ తదితరులు పాల్గొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz