పంటతో పాటు రైతు ప్రాణం కాపాడిన టీడీపీ ప్రభుత్వం


Send us your feedback to audioarticles@vaarta.com


ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. జనానికి మంచి చేయాలనే మనసు ఉండాలంతే. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద మనసు చాటుకుంది. పండ ఎండి, ఇక ఆత్మహత్య ఒక్కటే మార్గమనుకున్న ఓ రైతు కుటుంబాన్ని ఆదుకుంది.
కొరకోటి శ్రీనివాసులు.. 60 ఏళ్ల ఓ సాధారణ రైతు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పాల మండలం వెంకట్రాంపల్లి గ్రామానికి చెందిన ఈ రైతు 11 ఎకరాల్లో దానిమ్మ తోట వేశారు. కానీ సాగుకు నీరు లేదు. అప్పటికే 48 బోర్లు వేశారు, చుక్క నీరు పడలేదు. చివరి ప్రయత్నంగా తన ఇంటి ముందు బోరు వేస్తే, పుష్కలంగా నీరు పడ్డాయి.
దీంతో శ్రీనివాసులు ఆనందానికి అవధుల్లేవు. అయితే ఆయన ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఆయనపై కక్ష కట్టిన కొంతమంది, కరెంటు లైన్ రానివ్వకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చి 9 నెలలుగా వేధించారు. నీళ్లున్నా కరెంట్ లేక పొలం ఎండిపోతోంది, ఏమీ చేయలేని నిస్సహాయతతో ఆ రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.
సరిగ్గా అప్పుడే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజావేదికకు వెళ్లి సమస్యను చెప్పాలని సూచించారు. అప్పుడది నారా లోకేష్ గారి దృష్టికి వెళుతుందని చెప్పడంతో.. రైతుకు ధైర్యం వచ్చింది. వెంటనే విజయవాడ వెళ్లారు.
రైతు సమస్యపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, గండి బాబ్జి వెంటనే స్పందించారు. ఆ రైతుకు ధైర్యం చెప్పారు. వెంటనే అనంతపురం జిల్లా కలెక్టర్ కి ఫోన్లు చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. మంత్రి, ఎమ్మెల్యే ఇచ్చిన ధైర్యంతో నేరుగా అనంతపురం కలెక్టర్ ను వెళ్లి కలిశారు రైతు శ్రీనివాసులు.
కలెక్టర్ వెంటనే స్పందించారు. ఆఘమేఘాల మీద ఆదేశాలు జారీచేశారు. సరిగ్గా 4 రోజులకి పోలీస్ అధికారులతో రెవెన్యూ అధికారులు, ఎలక్ట్రిక్ అధికారులు అందరూ వచ్చారు. రైతు మోటార్ బోర్ కనెక్షన్ కి విద్యుత్ లైన్ లాగారు. దీంతో రైతు ఆనందానికి అవధుల్లేవు.
మోటారు దగ్గరే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గండి బాబ్జీ ఫొటోలు పెట్టి పూజలు చేశారు. ఆ తర్వాత బోర్ ఆన్ చేసి, పొలానికి నీరు పెట్టారు. అక్కడితో అయిపోలేదు. తన ఇంట్లో చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, శ్రీనివాస్, గండి బాబ్జీ ఫొటోల్ని పెట్టి పూజిస్తున్నారు. ప్రజలకు మంచి చేస్తే గుండెల్లో పెట్టుకొని పూజిస్తారని చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణగా నిలిచింది. ఇలా అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పాలన అందిస్తోంది టీడీపీ సర్కారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments