close
Choose your channels

Kalki 2898 AD:6000 సంవత్సరాల మధ్య జరిగే కథ.. 'కల్కి' టైటిల్ సీక్రెట్ చెప్పిన దర్శకుడు..

Monday, February 26, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కల్కి 2898AD(Kalki)’. సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఈ ఏడాది వేసవి కానుకగా మే9న ప్రపంచవ్యాప్తంగా మూవీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా టైటిల్ వెనక అర్థం తెలియజేశారు నాగ్ అశ్విన్.

తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర దర్శకుడు మాట్లాడుతూ 'ఈ చిత్రం కథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుంది. గతంతో ప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ఈ టైటిల్ పెట్టాం. దీనిలో మొత్తం 6000 సంవత్సరాల మధ్య జరిగే కథను చూపించనున్నాం. నాటి రోజులకు తగినట్లు ఓ ప్రపంచాన్ని సృష్టించాం. అన్నిట్లో భారతీయత కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేశాం' అన్నారు. దీంతో కల్కి సినిమాపై అంచనాలు ఒక్కసారిగా రెట్టింపయ్యాయి.

ఇక ఈ సినిమాలో లోక నాయకుడు కమల్‌ హాసన్‌ విల‌న్‌గా నటించనుండగా.. ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, రానా, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్.. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మూవీ డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. షూటింగ్ కూడా చివరి దశకు చేరుకోవడంతో శివరాత్రి నుంచి ప్రమోషన్స్ షూరూ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట.

ఇదిలా ఉంటే ఇటీవల ఓ కార్యక్రమంలో నటుడు అభినవ్ గోమఠం ఈ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్కి మూవీ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నానని.. ఈ మూవీ 9 పార్టులుగా రాబోతుందంటూ విన్నానని తెలిపారు. అది విన్న దగ్గర నుంచి సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది అంటూ పేర్కొన్నారు. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో సినిమాపై హైప్స్ పీక్స్‌కు వెళ్లాయి.

ప్రభాస్ సినిమాల విషయానికొస్తే ఈ మూవీతో పాటు మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో 'స్పిరిట్' చిత్రంలోనూ యాక్ట్ చేయనున్నారు. వీటితో పాటు 'సలార్' సీక్వెల్‌లోనూ నటించేందుకు రెడీ అయ్యారు. మొత్తానికి వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు ఫుల్‌ స్వింగ్‌లో దూసుకెళ్తున్నారు డార్లింగ్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos