close
Choose your channels

Ram Charan: గౌరవ డాక్టరేట్ అందుకున్న మెగా హీరో.. ఇకపై డాక్టర్ రామ్‌చరణ్‌

Saturday, April 13, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Ram Charan: గౌరవ డాక్టరేట్ అందుకున్న మెగా హీరో.. ఇకపై డాక్టర్. రామ్‌చరణ్‌

కళారంగంలో చేసిన సేవలకు గాను మెగా హీరో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్(Ram Charan) గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో భాగంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు డీజీ సీతారాం చేతుల మీదుగా డాక్టరేట్ ప్రదానం స్వీకరించారు. దీంతో ఇక నుంచి రామ్‌ చరణ్ కాస్త డాక్టర్ రామ్‌ చరణ్‌గా మారనున్నారు. చెర్రీ డాక్టరేట్ స్వీకరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానులు, నెటిజన్లు, ప్రముఖలు చెర్రీకి శుభాకాంక్షలు వ్యక్తం చేస్తున్నారు.

RRR మూవీతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న చరణ్‌ గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగారు. తాజాగా గౌరవ‌ డాక్టరేట్ అందుకుని మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. చిరంజీవి వారసుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన చెర్రీ.. తన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు దక్కించుకోవడంతో పాటు ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంటున్నారు. తాజాగా చిన్న వయస్సులోనే గౌరవ డాక్టరేట్ అందుకొని అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.దీంతో తండ్రికి తగ్గ వారసుడిగా చెర్రీ నిలిచాడని కొనియాడుతున్నారు.

Ram Charan: గౌరవ డాక్టరేట్ అందుకున్న మెగా హీరో.. ఇకపై డాక్టర్. రామ్‌చరణ్‌

ఇక చరణ్‌ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం దిగ్గజ దర్శకడు శంకర్ దర్శకత్వంలో 'గేమ్‌ ఛేంజర్' మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 80శాతం పూర్తి అయింది. ఇటీవల చెర్రీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన మూవీలోని 'జరగండి' లిరికల్ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చెర్రీ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించనుండగా.. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు. అలాగే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలోనూ చరణ్ నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ పూజాకార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో చరణ్ సరసన అలనాటి అందాల నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుంది.

Ram Charan: గౌరవ డాక్టరేట్ అందుకున్న మెగా హీరో.. ఇకపై డాక్టర్. రామ్‌చరణ్‌

మొత్తానికి RRR వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత రెండేళ్ల పాటు చెర్రీ సినిమాలు థియేటర్లలో విడుదల కాలేదు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పుడు ఒకేసారి మూడు చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. రెండు సంవత్సరాల గ్యాప్‌లోనే ఈ చిత్రాలు విడుదల కానున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.