close
Choose your channels

మహేశ్ మూవీ నుంచి జగ్గుభాయ్ బయటికి రావడానికి కారణాలివే!

Friday, July 19, 2019 • తెలుగు Comments

మహేశ్ మూవీ నుంచి జగ్గుభాయ్ బయటికి రావడానికి కారణాలివే!

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా అనీల్ రావిపూడి తెరెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. జమ్ముకశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుంటున్నట్లు ఇప్పటికే కొన్ని ఫొటోలు విడుదలయ్యాయి. అయితే అంతా బాగుంది షూటింగ్ కూడా ఏ ఇబ్బందులు లేకుండా జరుగుతోందనుకున్న సమయానికి ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్న అలనాటి హీరో, నేటి టాలీవుడ్ విలన్ జగపతి బాబు అలియాస్ జగ్గూభాయ్ తప్పుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయ్. దీంతో అసలేం జరుగుతోంది..? జగ్గూభాయ్ ఎందుకు బయటికొచ్చేశారు..? అని సినీ ప్రియులకు, అభిమానులకు అర్థం కాని పరిస్థితి. అంతేకాదు.. జగపతిబాబు అవమానకర రీతిలో బయటికొచ్చేశాడంటూ గత కొన్నిరోజులుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది. దీనిపై స్వయంగా జగపతిబాబే ట్విట్టర్, యూట్యూబ్ వేదికగా అసలేం జరిగిందనే దానిపై నిశితంగా వివరణ ఇచ్చారు.

నేను ఇప్పటికీ రెడీ..!

చిత్ర పరిశ్రమ తన కుటుంబం లాంటిదని.. అలాంటి చిత్ర పరిశ్రమ గురించి బహిరంగంగా మాట్లాడడం తనకిష్టంలేదన్నారు. ‘ నా 33 ఏళ్ల నా కెరీర్‌లో ఇలా ఎప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం రాలేదు. మహేశ్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం నుంచి నేను తప్పుకున్నానంటూ రకరకాల పుకార్లు వస్తున్నాయి. వాటిలో ఎలాంటి వాస్తవంలేదు. వాటిని ఎవరూ నమ్మొద్దు. ఇప్పటికీ ఆ సినిమాలో క్యారక్టర్ అంటే నాకెంతో ఇష్టం. ఇప్పటికీ చేయమంటే ఆ క్యారక్టర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఆ సినిమా కోసం రెండు సినిమాలు వదులుకున్నానన్నది కూడా నిజం. కానీ, చిత్ర పరిశ్రమలో కొన్ని పరిస్థితుల కారణంగా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. వాటిలో ఇదీ ఒకటి.. ఆ పరిస్థితుల కారణంగానే నేను ఆ సినిమాలో లేను. నేనా సినిమాను ఎంతో మిస్సవుతున్నాను. చిత్రబృందానికి నా శుభాకాంక్షలు’ అని ఓ వీడియోలో జగపతిబాబు చెప్పుకొచ్చారు.

ఇంతకీ అసలేం జరిగింది..!

అయితే బయటికొచ్చిన విషయం నిజమేనని మాత్రమే ఒప్పుకున్న జగ్గుభాయ్ ఎందుకు రావాల్సి వచ్చింది..? చిత్ర పరిశ్రమలో అసలేం జరిగింది..? తనను సరిలేరు నీకెవ్వరూ చిత్రానికి కొన్ని పరిస్థితులు దూరం చేశాయి..? అని అంటున్న జగపతిబాబు ఆ పరిస్థితులేంటో మాత్రం చెప్పకపోవడం గమనార్హం. మొత్తానికి చూస్తే మళ్లీ ఈ వ్యవహారంపై మరిన్ని పుకార్లు, అనుమానాలు, ఊహాగానాలు మాత్రం ఎక్కువవ్వడం ఖాయమని దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.

Get Breaking News Alerts From IndiaGlitz