close
Choose your channels

ర‌వితేజ చిత్రానికి త‌మ‌న్ సంగీతం

Sunday, November 3, 2019 • తెలుగు Comments

ర‌వితేజ చిత్రానికి త‌మ‌న్ సంగీతం

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. లైట్ హౌస్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఠాగూర్ మ‌ధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌రవేగంగా జ‌రుగుతున్నాయి. ఈ సినిమాకు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హించ‌నున్నారు.

ర‌వితేజ `కిక్` చిత్రంతో సంగీత ద‌ర్శ‌కుడిగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన త‌మ‌న్ అగ్ర సంగీత ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా స్థానాన్ని సంపాదించుకున్నారు. ర‌వితేజ హీరోగా చేసిన ప‌లు చిత్రాల‌కు త‌మ‌న్ సంగీతం అందించారు. తాజాగా మ‌రోసారి ర‌వితేజ చిత్రానికి త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నారు. ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని, శృతిహాస‌న్ కాంబినేష‌న్‌లో ఇది వ‌ర‌కు రూపొందిన `బ‌లుపు` చిత్రానికి కూడా త‌మ‌న్ సంగీతాన్ని అందించారు. ఆ చిత్రం మ్యూజికల్‌గా మంచి హిట్‌ను సాధించింది. కాగా ర‌వితేజ న‌టిస్తున్న ఈ 66వ చిత్రంలో ఆయ‌న ప‌వ‌ర్‌పుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌నున్నారు. న‌వంబ‌ర్‌లో ఈ సినిమా గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.

Get Breaking News Alerts From IndiaGlitz