దీప ఆర్ట్స్ బ్యానర్ పై సుప్రసిద్ధ దర్శక కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో తన కొడుకు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా నటిస్తూ అంకిత నస్కర్ హీరోయిన్ గా జంటగా నటిస్తూ వచ్చిన చిత్రం తల. రోహిత్, ఎస్తేర్ నోరోన్హా, సత్యం రాజేష్, అజయ్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ తదితరులు కీలకపాత్రలో నటిస్తూ వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఈ చిత్రం విడుదల కావడం జరిగింది. ఈ చిత్ర కథ విషయానికి వస్తే...
కథ :
తన తల్లి ప్రేమించిన వ్యక్తి తనకు దూరమై అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా కొడుకు (రాంబాబుగా రాగిన్ రాజ్) తన తండ్రి (రంబాబుగా రోహిత్)కోసం వస్తాడు. కానీ అప్పటికే తన తండ్రికి ఎస్తేర్ (లక్ష్మి) తో వివాహం అయి ఉంటుంది. అలా వచ్చిన తరువాత తన తండ్రి కుటుంబంలోకి తాను ఎవరో చెప్పకుండానే వెళ్తాడు. అదే సమయంలో ఆ కుటుంబంలోని అమ్మాయి అతడిని చూసి ఇష్టపడుతుంది. అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి సంఘటనలు జరుగుతాయి? హీరోకు తన తండ్రి దగ్గర పరిచయమైన అమ్మాయి చివరిగా హీరోకు ఏమవుతుంది? వారి కుటుంబంలోకి వచ్చిన సమస్య ఎటువంటిది? ఆ సమస్యను వారు ఎలా పరిష్కరిస్తారు? అసలు చివరికి తన తల్లిదండ్రులు కలుస్తారా? ఈ ప్రయాణంలో వారి జీవితాలు ఎటువంటి మలుపులు తిరుగుతాయి? వారికి సత్యం రాజేష్ (బబ్లూ) ఇంద్రజ (ఈశ్వరి) ఎలా సహాయపడతారు? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటుల నటన:
అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్ తొలి చిత్రం కావడంతో ముందుగా అతని నటన గురించి మాట్లాడుకోవాలి. మొదటి చిత్రమైనప్పటికీ ఎక్కడ కూడా కొత్తగా వచ్చిన నటుడిలా అనిపించలేదు. ప్రతి సీన్, ప్రతి ఎమోషన్ ఎంతో స్పష్టంగా తనదైన శైలిలో తను నటిస్తూ మంచి నటుడు అని తొలి చిత్రంతోనే ప్రూవ్ చేసుకున్నాడు. రాగిన్ రాజ్ తో జంటగా అంకిత అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఎంతోకాలం తర్వాత తెరపైకి వచ్చిన రోహిత్ తన తండ్రి పాత్రలో నటిస్తూ ఆ పాత్రకు ప్రాణం పోశారు. అదేవిధంగా ఎస్తేర్ నోరోన్హా తన పాత పరిధిలో ఎప్పుడూ గ్లామర్ గా కనిపించే ఈమె ఈ చిత్రంలో తల్లి సెంటిమెంట్తో తన నటిస్తూ మంచి కామెడీని అలాగే ఎమోషన్ను పండించారు. ఈ చిత్రంలో నెగిటివ్ పాత్రల్లో నటించిన వారంతా సీన్ కు తగ్గట్లు నటిస్తూ చిత్రానికి మరింత బోనస్ గా నిలిచారు. ముఖ్యంగా రాధా చంద్రశేఖర్ నెగిటివ్ పాత్రలో అద్భుతంగా నటించారు. అజయ్, సత్యం రాజేష్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ వంటి వారు ఈ చిత్రానికి మరొక ప్లస్ పాయింట్ గా నిలిచి తమ పాత్రలో తాము నటిస్తూ ఈ చిత్రం మరింత అధ్బుతంగా రావడానికి తోడ్పడ్డారు. సత్యం రాజేష్ (బబ్లూ) పోలీస్ ఆఫీసర్ గా సెంటిమెంట్ సీన్లు చిత్రంలో బాగా పండాయి. అదేవిధంగా ఇంద్రజ (ఈశ్వరి) గారి నటన, మరో పోలీసుగా అజయ్ నటన చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చాయి.
సాంకేతిక విశ్లేషణ :
ఈ చిత్రానికి కథ ప్రాణమని చెప్పుకోవాలి. ట్రైలర్ లో చెప్పినట్లు అమ్మాయి కోసం ప్రాణాలు ఇస్తున్న జనరేషన్లో అమ్మకోసం ఇంత కష్టపడే కొడుకు కథగా దీనిని చెప్పుకోవచ్చు. ఈ కథను తెరపైకి తీసుకువెళ్లడంలో దర్శకుడిగా అమ్మ రాజశేఖర్ సక్సెస్ అయ్యారు. స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ ల్యాగ్ అనిపించకుండా ఎంతో స్పష్టంగా చిత్రాన్ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా రూపొందిస్తూ ముందుకు సాగారు. అలాగే చిత్రంలోని పాటలు ఆ పాటలకు తగ్గ డాన్స్ స్టెప్స్ తో పాటలను మరింత హిట్ అయ్యేలా చేశారు. చిత్రం అంతట బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరొక బోనస్గా నిలిచింది. చిత్రంలోని యాక్షన్ సీన్స్ అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఈ చిత్రానికి హైలైట్ అని చెప్పుకోవాలి. నిర్మాణ విలువలలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన చిత్రాన్ని చాలా క్వాలిటీతో అందిస్తూ మంచి విఎఫ్ఎక్స్ వర్కులతో చిత్రాన్ని ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేవిధంగా తీశారు. టేకింగ్ లో డిఓపి తనదైన శైలిలో పెద్ద సినిమాలకు చేసినట్లుగానే శ్యామ్ కె నాయుడు విజేతానికి కూడా అంతే బాగా పనిచేశారు. ఈ చిత్ర ఎడిటర్ చిత్రానికి మెయిన్ పిల్లర్గా పిలుస్తూ అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చారు. కలరింగ్ అలాగే డిఐలో కూడా దర్శకుడు ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది. ఈ చిత్రంతో అమ్మ రాగిన్ రాజ్ అని ఒక అద్భుతమైన నటుడు ఇండస్ట్రీకి పరిచయం కావడమే కాకుండా అమ్మ రాజశేఖర్ ఈజ్ బ్యాక్ అనే విధంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రం అంతా ఉత్తర ప్రదేశ్ లోని రియల్ లొకేషన్స్ లో తీయడం కొత్త విషయంగా చెప్పుకోవాలి. చిత్రంలో ఉన్న మూడు ఫైట్లు చాలా బాగా వచ్చాయి. దర్శకుడు చిత్రానికి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ను ఎంతో బాగా వాడుకున్నట్లు అర్థమవుతుంది. అడవులు, గ్రామీణ ప్రాంతాలు వంటి రియల్ లోకేషన్ లో చిత్రాన్ని తీయడం చాలెంజ్ అయినప్పటికీ దర్శకుడు ఆ ఛాలెంజ్ను అధిరోహించి చిత్రాన్ని తెరకెక్కించారు. అలాగే ఈ సినిమాలోని రెండు పాటలలో తమన్ మార్క్ కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
కథ, దర్శకత్వం, నటీనటుల నటన, సాంగ్స్, డిఓపి, ఎడిటింగ్ వర్క్.
మైనస్ పాయింట్స్:
కొంచెం వైలెన్స్ ఎక్కువగా ఉండటం, తెలిసిన ఆర్టిస్టులు ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది.
సారాంశం:
మదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఎన్నో అద్భుతమైన చిత్రాలలో ఈ చిత్రం కూడా స్థానం సంపాదించుకుంది. కుటుంబం సమేతంగా వెళ్లి చూసే విధంగా మంచి ఎమోషన్తో ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వచ్చింది.
Comments