త్వరలోనే ఏపీ హైకోర్టు, అసెంబ్లీ భవనాలు


Send us your feedback to audioarticles@vaarta.com


అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హైకోర్టు, అసెంబ్లీ శాశ్వత భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచింది. ఈ మేరకు సీఆర్డీఏ నోటిఫికేషన్ ఇచ్చింది.
768 కోట్ల రూపాయల అంచనాతో అసెంబ్లీ, 1048 కోట్ల అంచనాతో హైకోర్టు భవనాలు నిర్మించేందుకు అర్హత కలిగిన కంపెనీలు ముందుకు రావాలని కోరారు. 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత ఫైనాన్షియల్ బిడ్స్ ఓపెన్ చేసి, అర్హతలు చూసి ఏజెన్సీల్ని ఖరారు చేస్తారు.
అసెంబ్లీ భవనాన్ని విభిన్నంగా నిర్మించబోతోంది కూటమి సర్కారు. దాదాపు 104 ఎకరాల్లో ఇది రాబోతోంది. బేస్ మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా, మరో 3 అంతస్తుల్లో అసెంబ్లీ నిర్మాణం విలక్షణంగా ఉండబోతోంది. లండన్ కు చెందిన పోస్టర్స్ సంస్థ ఈ నమూనాను డిజైన్ చేసింది. అసెంబ్లీ పైన ఎత్తైన శిఖరం ఆకారం ఏర్పాటుచేస్తారు. అందులో పైకి వెళ్లి అమరావతి నగరాన్ని చూసేలా ఏర్పాటు చేశారు.
ఇక హైకోర్టును కూడా 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో వినూత్నంగా నిర్మించబోతున్నారు. 7 అంతస్తుల ఈ డిజైన్ కూడా ఎంతో ఆకర్షణీయంగా ఉండబోతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com