Konda Surekha :తెలంగాణ మంత్రి కొండా సురేఖకు తీవ్ర అనారోగ్యం.. సెల్ఫీ వీడియో విడుదల..


Send us your feedback to audioarticles@vaarta.com


తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇటీవల అసెంబ్లీలో కానీ మీడియా ఎదుట కనపడటం లేదు. దీంతో ఆమెకు ఏమైందనే చర్చ జోరందుకుంది. అయితే ఆమె కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. డెంగ్యూ జ్వరంలో గత వారం రోజులుగా హైదరాబాద్‌లోని తన ఇంటికే పరిమితం అయ్యారు. అభిమానుల ఆందోళన నేపథ్యంలో ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆమె తీవ్ర నీరసంగా కనపడుతున్నారు.
"గత కొన్ని రోజులుగా నేను అసెంబ్లీ రాకపోవడం, ప్రజల మధ్య కనిపించకపోవడంతో ఎందుకు రావట్లేదు అనే చర్చ సాగుతోంది. నాకు ఆరోగ్యం బాగాలేదు, డెంగ్యూ ఫీవర్ రావడం వల్లే బయటకు రాలేక, ఇంట్లోనే ఉంటున్నాను. ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. గ్లూకోజ్‌లు ఎక్కిస్తున్నారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తాను. కాబట్టి ప్రజలంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, సెలవు తీసుకుంటున్నాను" అని తెలిపారు.
ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ఆమె.. ఐదు రోజులుగా ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తగ్గకపోవడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగీ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో హైదరాబాద్‌లోని తన నివాసంలో చికిత్స తీసుకుంటూ విశ్రాంతి పొందుతున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతూనే తన మంత్రిత్వ శాఖ వ్యవహారాలను కూడా ఆమె పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లపై సమీక్షలు జరుపుతున్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సురేఖ అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో.. మరో మంత్రి సీతక్క మేడారం జాతరకు సంబంధించిన అన్ని పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాగా తమ నాయకురాలు డెంగ్యూ బారిన పడినట్లు తెలుసుకున్న సురేఖ అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే ఆమె పూర్తి ఆరోగ్యంతో బయటకు రావాలని ప్రార్థిస్తున్నారు. ఆ వనదేవతలే తమ నాయకురాలికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నారు.
డెంగీ జ్వరంతో బాధపడుతున్న కొండా సురేఖ ప్రజలకు సందేశం.
— Konda Surekha (@KMuraliSurekha) February 20, 2024
తాను డెంగ్యూ ఫీవర్‌తో బాధపడుతోన్న నేపథ్యంలోనే ప్రజల మధ్యకు రాలేకపోతున్నానని, ఇంట్లోనే గ్లూకోజ్‌లు, యాంటీబయాటిక్స్ ఎక్కిస్తున్నారు. కాబట్టి ప్రజలంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, సెలవు తీసుకుంటున్నాను. pic.twitter.com/jo1KBWrHGO
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com