close
Choose your channels

'అద్భుతం' 'పేరేంటి ఊరేంటి' లిరికల్ సాంగ్ విడుదల

Sunday, September 5, 2021 • తెలుగు Comments

అద్భుతం పేరేంటి ఊరేంటి లిరికల్ సాంగ్ విడుదల

తేజ సజ్జ, శివాని రాజశేఖర్ జంటగా మహా తేజ క్రియేషన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై చంద్రశేఖర్ మోగుళ్ళ నిర్మిస్తున్న సినిమా అద్భుతం. మల్లిక్ రామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఊరేంటి పేరేంటి లిరికల్ సాంగ్ విడుదలైంది. తేజ, శివాని రాజశేఖర్ ఇద్దరూ ఈ పాటలో చాలా అందంగా ఉన్నారు.

రధన్ అద్భుతం సినిమాకు సంగీతం అందిస్తున్నారు. విద్యాసాగర్ చింత సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు గ్యారీ బీహెచ్ ఎడిటర్. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు కథ అందించారు. లక్ష్మీ భూపాల స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

నటీనటులు: తేజ సజ్జ, శివాని రాజశేఖర్..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz