వారసత్వంతో స్టార్స్ కాలేరు.. అయినా నిలబడలేరు!
టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ డైరెక్టర్గా ఉన్న తేజ ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా.. ఇంటర్వ్యూలల్లో ఆసక్తికర విషయాలను.. కాసిన్ని వివాదాస్పద వ్యాఖ్యలను చేస్తుంటారన్న విషయం విదితమే. ఆయనంతే.. ఆయన రూటే సెపరేటుగా ఉంటుంది. ఈయన డైరెక్ట్ చేసిన హీరో, హీరోయిన్లందరూ ప్రస్తుతం స్టార్లుగా ఓ వెలుగుతున్నారు. కాగా.. ఎలాంటి దాపరికం లేకుండా మాట్లాడేయడం ఆయన నైజమన్న విషయం విదితమే. తాజాగా మీడియా ముందుకొచ్చిన తేజ.. అదే నైజాన్ని మరోసారి బయటపెట్టారు.
వారసత్వ హీరోల గురించి ప్రస్తావించిన ఆయన... స్టార్ హీరోలు కావడం అంత ఆషామాషీ విషయం కాదని చెప్పుకొచ్చిన ఆయన.. ఆత్మ - ఊపిరి అంతా నటనపైనే పెట్టి అహర్నిశలు కృషి చేసిన వారే స్టార్స్ అవుతారని జోస్యం చెప్పారు. అంతేకానీ.. వారసత్వంతో ఎవరూ స్టార్స్ కాలేరని తెలిపారు. ఒకవేళ వారసత్వంతో స్టార్స్ అయినా ఎక్కువకాలం నిలబడలేరన్నారు. అయితే తేజ ఎవర్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో అన్నది మాత్రం తెలియరాలేదు కానీ.. ఈయన మాటలు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి.