close
Choose your channels

ఆర్టికల్ 370 విషయంలో టీడీపీ అనూహ్య నిర్ణయం!

Monday, August 5, 2019 • తెలుగు Comments

కేంద్రలో రెండోసారి అధికారం దక్కించుకున్న నరేంద్ర మోదీ సర్కార్.. జమ్మూ కాశ్మీర్‌ను మూడు ముక్కలు చేసేసింది. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆర్టికల్ 370, 35A రద్దు చేస్తూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకూ ఉన్న జమ్మూ-కాశ్మీర్ మూడు ప్రాంతాలుగా విడిపోయింది. జమ్మూ, కాశ్మీర్, లఢక్ అనే మూడు ప్రాంతాలుగా మోదీ సర్కార్ విడగొట్టేసింది.!. దీంతో కాశ్మీర్ స్వయంప్రతిపత్తి కోల్పోయినట్లయ్యింది. అయితే మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు సాదరంగా స్వాగతించగా.. మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరించడం జరిగింది. 

అయితే తెలుగు రాష్ట్రాల పార్టీలయిన వైసీపీ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. అంతేకాదు.. వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా చరిత్రలో మిగిలిపోతారని చెప్పుకొచ్చారు.  అయితే ఒకప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యమై విడిపోయిన టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందని అందరూ ఎంతో ఆసక్తిగా గమనించారు. ఈ ఆర్టికల్ రద్దు పట్ల కేంద్రం తీసుకున్న నిర్ణయం హర్షనీయమని టీడీపీ చెప్పుకొచ్చింది. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు.  

కేంద్రం నిర్ణయం హర్షనీయం!

"గత 60 సంవత్సరాలుగా జమ్మూకశ్మీర్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, చిక్కులు దూరమవుతాయి. ఇక నుంచి జమ్ముకశ్మీర్‌ ప్రజలు సంతోషంగా జీవించేలా కేంద్రం తగు చర్యలు తీసుకోవాలి. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమానహక్కులు ఉండాలి. గత ఆరు దశాబ్దాలుగా కశ్మీరీల ఆశలు, ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నెరవేరలేదని.. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో వారికి ఇకపై ఆ పరిస్థితి ఉండబోదని నేను అనుకుంటున్నాను. జమ్ముకశ్మీర్‌ విభజనకు సంబంధించిన బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టిన హోంమంత్రి అమిత్‌షాకు అభినందనలు తెలియజేస్తున్నాను.

Get Breaking News Alerts From IndiaGlitz