close
Choose your channels

తొడలు కొట్టుడేంది, మీసాలు తిప్పుడేంది : అసెంబ్లీ వేదికగా టీడీపీ 'గలీజు' రాజకీయం, బాబు కోసం ఇంత రచ్చా..?

Thursday, September 21, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తొడలు కొట్టుడేంది, మీసాలు తిప్పుడేంది : అసెంబ్లీ వేదికగా టీడీపీ గలీజు రాజకీయం, బాబు కోసం ఇంత రచ్చా..?

చట్టసభలన్న గౌరవం లేదు.. సభాపతి అన్న మర్యాద లేదు. సభా సాంప్రదాయలను మంటగలిపి, కోట్లాదిమంది ప్రజలు చూస్తున్నారన్న ఇంగితం లేకుండా ప్రవర్తించారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు. ఇవాళ ఏపీ అసెంబ్లీ తొలి రోజు సమావేశాలను చూస్తే జనానికి చట్టసభలపై వున్న కొద్దిపాటి గౌరవం కూడా పోతుంది. అర్ధవంతమైన చర్చలు జరిగి, ప్రజల భవిష్యత్తును నిర్దేశించే చట్టసభలో వేదికలపై చేసినట్లుగా మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం వంటి ఘటనలు చూసి మేధావులు తలలు బాదుకుంటున్నారు.

జనంలో సానుభూతికి అసెంబ్లీని వేదికగా చేసుకుని :

ఎందుకింత అక్కసు అంటే.. చంద్రబాబును జైల్లో పెట్టడమే కారణం. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఆయనను పక్కా సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేసి జైలుకు తరలించింది జగన్ సర్కార్. బెయిల్ కోసం ఢిల్లీ నుంచి కాస్ట్లీ లాయర్లను రప్పించినా ఫలితం కనిపించడం లేదు. ఇటు ప్రజల్లో సానుభూతి సంపాదించడానికి చేసిన ప్రయత్నాలు కూడా నీరుగారిపోయాయి. దీంతో పచ్చ గ్యాంగ్‌లో నైరాశ్యం అలుముకుంది. చిన్నారులతో ధర్నాలు, దీక్షలు చేయించినా మైలేజీ రాకపోవడంతో ఏకంగా అసెంబ్లీనే వేదికగా ఎంచుకున్నారు.

తొడలు కొట్టుడేంది, మీసాలు తిప్పుడేంది : అసెంబ్లీ వేదికగా టీడీపీ గలీజు రాజకీయం, బాబు కోసం ఇంత రచ్చా..?

ఇదంతా బాబు కుట్రేనా :

అసెంబ్లీ సమావేశాలు జరగడానికి ముందు రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న చంద్రబాబును టీడీపీ నేతలు యనమలన రామకృష్ణుడు, నందమూరి బాలకృష్ణ కలిశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలన్నది బాబు గారు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వాన్ని ఎలా రెచ్చగొట్టాలి, ఎలా చేస్తే మీడియాలో , జనంలో మంచి ప్రచారం లభిస్తుంది అన్న దానిపై చంద్రబాబు సూచనలు చేశారు. ఈ ప్రకారంగానే బాలయ్య బాబు అసెంబ్లీలో తొడగొట్టి .. మీసం తిప్పి నానా హంగామా చేశారు. దీనికి మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా బదులిచ్చారు. మీసాలు తిప్పడం, తొడలు కొట్టడం సినిమాల్లో పెట్టుకోవడానికి పనికొస్తాయంటూ వ్యాఖ్యానించారు. చూస్కుందాం అంటే.. రా చూసుకుందామని అంబటి సవాల్ విసిరారు.

బావ కోసం మారిన బాలయ్య :

రెండు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న బాలకృష్ణ .. అసెంబ్లీ సమావేశాలకు తూచా తప్పకుండా హాజరవుతారు. నిరసన కార్యక్రమాల్లో తోటి సభ్యులతో పాటు ఫ్లకార్డులు పట్టుకోవడం లేదంటే మూలన కూర్చోవడం ఇదే ఆయన పని. అలాంటిది బాలయ్య ఇలా చేశారేంటీ అని టీడీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. స్వయంగా బావ, తన వియ్యంకుడు చంద్రబాబు జైల్లో వుండటంతో ఆయన కళ్లలో ఆనందం చూడటానికి, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తన సత్తా చూపడానికి. కానీ ఫైనల్‌గా జరిగిందేంటి అంటే బాలయ్య పరువు పొగొట్టుకోవడమే. ఆయనకు సామాజిక అంశాల మీద పట్టులేదు.. మాట్లాడే నేర్పు లేదు. ఆయనకు తెలిసిన విద్య.. సులువుగా వచ్చే చేసే పని ఒక్కటే.. మీసం తిప్పడం .. తొడగొట్టడం. ఈ ఒక్క పని చేస్తే తమ అనుకూల మీడియాలో విస్తృత ప్రచారం చేసుకోవచ్చు బాలయ్య ప్లాన్.

తొడలు కొట్టుడేంది, మీసాలు తిప్పుడేంది : అసెంబ్లీ వేదికగా టీడీపీ గలీజు రాజకీయం, బాబు కోసం ఇంత రచ్చా..?

కోటంరెడ్డి కూడా చించుకున్నాడే :

ఇంతలో వైసీపీ నుంచి టీడీపీలోకి జంపైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా చంద్రబాబు కళ్లలో పడటానికి నానాపట్లు పడ్డారు. స్పీకర్ పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టిన సమయంలో వాళ్లతో చేరి నినాదాలు చేశారు. పేపర్లు లాగేసి.. మానిటర్ సైతం లాక్కునేందుకు యత్నించడం ఇక్కడ గమనార్హం. ఇది చూసిన జనాలు కొత్త బిచ్చగాడు పొద్దేరగడు అన్నట్లుగా నవ్వుకుంటున్నారు. మొత్తానికి టీడీపీ నేతలు ఏదో చేయబోతే.. ఇంకేదో జరిగిందన్న మాట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.