close
Choose your channels

Nara Lokesh:‘‘జాతి ’’ మీడియా కాదు లోకేషా.. జాతీయ మీడియా , అర్ణాబ్‌కు అడ్డంగా దొరికిపోయిన చినబాబు

Wednesday, September 20, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టీడీపీ భావి వారసుడు నారా లోకేష్ సమర్ధతపై సొంత పార్టీలోనే ఎవరికి నమ్మకం లేదన్నది వాస్తవం. టీడీపీ నేతలే ఈ విషయాన్ని బహిరంగంగా వ్యాఖ్యానిస్తూ వుంటారు. వాగ్థాటి, వ్యూహాలు రచించడం, శ్రేణులను నడిపించడం ఇలా ఏ విషయంలోనూ ఆయన ఇప్పటి వరకు తనను తాను నిరూపించుకోలేకపోయారు. చంద్రబాబు అరెస్ట్ అయి జైల్లో వుండగా.. ఇలాంటి సమయంలో ప్రభుత్వంపై పోరాడటంలో, కేసులో తన తండ్రి ప్రమేయం లేదని వాదించడంలోనూ, జనంలో సానుభూతి సంపాదించడంలోనూ లోకేష్ విఫలమయ్యారు. రాష్ట్రంలో పరిస్ధితి ఇలా వుంటే ఆయన ఢిల్లీలో కాలం గడుపుతున్నారు. అందుకే పార్టీని జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లో పెట్టాలనే డిమాండ్లు నానాటికీ తీవ్రమవుతున్నాయి.

అర్ణాబ్‌తో ఆటలా :

చంద్రబాబు అరెస్ట్‌ను జాతీయ మీడియాకు, జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్తానని ఢిల్లీ వెళ్లిన లోకేష్ అక్కడ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. నేషనల్ మీడియాలో చర్చల్లో పాల్గొన్న ఆయనను సీనియర్ జర్నలిస్ట్ అర్ణాబ్ గోస్వామి ఓ ఆట ఆడుకున్నారు. సహజంగానే నోరేసుకుని పడిపోయే అర్ణాబ్‌తో డిబేట్ అంటే తలలు పండిన నేతలు సైతం ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. అలాంటిది ఏదేదో మాట్లాడే లోకేష్ ఎంత జాగ్రత్తగా వుండాలి. ఢిల్లీలో సత్తా చూపిస్తానని వెళ్లిన లోకేష్ అక్కడ అడ్డంగా దొరికిపోయారు. మన జాతి మీడియాను అయితే ఎలాగైనా మ్యానేజ్ చేయొచ్చు.. కానీ జాతీయ మీడియాను అలా చేయడం కుదరదు. ఢిల్లీ వెళ్ళేటపుడు సదరు సబ్జెక్ట్ మీద బాగా అధ్యయనం చేసి వెళ్ళాలి. లేదా దూరంగా ఉండాలి.

అర్ణాబ్ అడిగిన ప్రశ్నలు ఒకసారి చూస్తే..

టెండర్లు లేకుండా రూ. 370 కోట్లు అడ్వాన్స్డ్ పేమెంట్ ఎలా చేసారు?

90:10 రేషియో ఎంవోయూ ప్రకారం ప్రైవేట్ సంస్ధ తన వాటా కింద 90% నిధులు జమ చేయకముందే, మీ ప్రభుత్వం తన 10% భాగం నగదును ఎందుకు ముందే జమ చేసింది?

ముందే సీమెన్స్ ఇండియా, డిజైన్ టెక్ సంస్ధలతో డీల్ కుదుర్చుకుని, స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్‌ని ఏర్పాటు చేసి, టెండర్ లేకుండా నిధులు రిలీజ్ చేసారా?

ఈ ప్రాజెక్ట్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పినా, ఆ నోట్‌ని అతిక్రమించి మరీ మీరు ఎందుకు ఈ డీల్‌ని కుదుర్చుకున్నారు?

ఢిల్లీలో పోయిన చంద్రబాబు పరువు :

ఈ ప్రశ్నల దాడితో ఉక్కిరిబిక్కిరైన లోకేష్ సమాధానాలు చెప్పలేక తటపటాయించారు. ఈ డిబేట్‌ను టీవీల్లో చూసిన వారు తలోరకంగా స్పందిస్తున్నారు. నెటిజన్లయితే లోకేష్‌పై సెటైర్లు పేలుస్తున్నారు. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు పట్టుకుని ఢిల్లీలో లేపుతాం..ఊపుతాం అంటే పడుకున్న గాడిదను లేపి తన్నించుకోవడం లాంటిదే ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇన్నాళ్ళూ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే పోయిన చంద్రబాబు పరువును లోకేష్ పుణ్యాన అది జాతీయ స్థాయికి చేరింది అంటున్నారు. అసలు మనోడు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీయేనా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో లోకేష్ సత్తా చూసిన తెలుగు తమ్ముళ్లు యథావిధిగా తలలు పట్టుకుంటున్నారు. ఈయనను నమ్ముకుని పార్టీని చేతిలో పెడితే తమ భవిష్యత్తు ఏంటని జుట్టు పీక్కుంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.