close
Choose your channels

Taraka Ratna:పెళ్లి తర్వాతే కష్టాలు.. అంతటా వివక్షే, నీ గుండెల్లో అంతులేని బాధ : తారకరత్న సతీమణి ఎమోషనల్ పోస్ట్

Sunday, March 19, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సినీనటుడు నందమూరి తారకరత్న అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమను శోక సంద్రంలో ముంచెత్తింది. 39 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన తిరిగిరాని లోకాలకు తరలిపోవడాన్ని నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పుడే తారకరత్న చనిపోయి రోజులు గడుస్తున్నాయి. మరోవైపు ఆయన సతీమణి అలేఖ్యారెడ్డి , పిల్లలు ఇప్పుడు దిక్కులేనివారు అయ్యారు. ఇక అలేఖ్యా రెడ్డి భర్త మరణంతో బాగా కృంగిపోయారు. కష్ట సుఖాల్లో తోడుగా వున్న ఆయన లేకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారని ఫిలింనగర్ టాక్. ఈ క్రమంలో గత కొన్నిరోజులుగా తారకరత్నను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆయనతో వున్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. అంతా బాగానే వుంది కానీ.. అలేఖ్యా రెడ్డి తన పోస్టులతో నందమూరి కుటుంబాన్ని బాగా టార్గెట్ చేస్తున్నారు. బాలయ్య తప్పించి.. కష్టాల్లో తమకు ఎవ్వరూ అండగా నిలబడలేదని ఆమె వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా అలేఖ్య పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రశాంతత, సంతోషం వున్న చోట మళ్లీ కలుద్దాం:

తాజాగా మరోసారి భర్త గురించి ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘‘ మనం కలిశాం, మంచి స్నేహితులయ్యాం, డేటింట్ ప్రారంభించామని.. జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టాలని నువ్వు నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి యుద్ధం చేయడం స్టార్ట్ చేశావ్.. మనిద్దరం పెళ్లి చేసుకున్న క్షణం నుంచి కష్టాలు మొదలయ్యాయి. మనపై వివక్ష చూపించినా, బతికాం, సంతోషంగా వున్నాం. పిల్లలు పుట్టాక జీవితంలో సంతోషం వచ్చింది. కుటుంబం దూరమవ్వడంతో పెద్ద కుటుంబం కావాలని కోరుకున్నావ్. నువ్వు గుండెల్లో మోసిన బాధను ఎవరూ అర్ధం చేసుకోలేదు. కష్టాల్లో నేను నీకు సాయం చేయలేకపోయా. మొదటి నుంచి చివరి వరకు మనకు అండగా నిలిచిన వ్యక్తులు మాత్రమే మనతో వున్నారు. ఓబు నువ్వే మా రియల్ హీరో. ప్రశాంతత, సంతోషం వున్న చోట మళ్లీ మనం కలుద్దాం ’’ అంటూ అలేఖ్య రెడ్డి పోస్ట్ చేశారు.

బాలయ్యే మన కుటుంబమన్న అలేఖ్య:

ఇకపోతే.. ఈ వారం ప్రారంభంలో నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి అలేఖ్య పోస్ట్ పెట్టారు. ’’మంచి చెడుల్లో అండగా, కొండలా చివరి వరకు తమ వెంట నిల్చుంది ఒక్కరే. మాకంటూ కుటుంబం అని పిలిచేది ఆయననే.. ఓ తండ్రిలా తారకరత్నను ఆసుపత్రికి తీసుకెళ్లడమే కాకుండా, ఆయనను కంటికి రెప్పలా కాచుకున్నారు. చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు .. ఒంటరిగా కుమిలిపోయేవారు. నువ్వు మాతో ఇంకొన్నాళ్లు వుండాల్సింది ఓబు’’ అంటూ అలేఖ్యారెడ్డి పోస్ట్ చేశారు. అంతేకాదు.. బాలకృష్ణతో తన పిల్లలు, తారకరత్న ఫోటోలను కలిపి ఎడిట్ చేసిన వారికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. చివరిలో #nbk #jaibalayya #balayya #tarakrathna అనే హ్యాష్‌టాగ్స్ ఇచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.