close
Choose your channels

మ‌హేష్‌తో మ‌ళ్లీ చేస్తున్న మిల్కీ బ్యూటీ... త్వ‌ర‌లోనే షూట్‌!

Monday, March 8, 2021 • తెలుగు Comments

మ‌హేష్‌తో మ‌ళ్లీ చేస్తున్న మిల్కీ బ్యూటీ... త్వ‌ర‌లోనే షూట్‌!

మ‌హేష్‌తో మిల్కీ బ్యూటీ మ‌ళ్లీ జోడీ అవుతోంది. అది కూడా రాజ‌మౌళి సినిమాలోనో, లేకుంటే మ‌హేష్‌తో అనిల్ రావిపూడి చేస్తున్న సినిమాలోనో కాదు. మ‌రో రెండు రోజుల్లోనే మ‌హేష్ అండ్ మిల్కీ క‌లిసి ప‌నిచేయ‌బోతున్నారు.

ఆల్రెడీ స‌ర్కారువారి పాట షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని హైద‌రాబాద్‌కి వ‌చ్చేశాడు మ‌హేష్‌. ఇప్పుడు మిల్కీ బ్యూటీ కూడా త్వ‌ర‌లోనే హైద‌రాబాద్‌కి వ‌చ్చేస్తుంది. ఇక్క‌డ ఓ ప్రైవేట్ స్టూడియోలో షూటింగ్ చేయ‌బోతున్నారు. అది కూడా జ‌స్ట్ ఒన్లీ ఒన్ డేనే. ఒక‌వేళ ప్యాచ్ వ‌ర్క్ ఉంటే ఇంకో రోజులో కంప్లీట్ చేస్తారు.

ఒన్ డే ప్ల‌స్ ప్యాచ్ వ‌ర్క్ అన‌గానే సీన్ ఏంటో మీకు అర్థ‌మైపోయింది క‌దా! య‌స్ ఇదేమీ మ‌హేష్ సినిమాలో మిల్కీ చేస్తున్న గెస్ట్ అప్పియ‌రెన్స్ కాదు. వీళ్లిద్ద‌రూ క‌లిసి చేస్తున్న ఓ యాడ్ షూట్‌. ఈ షూట్ కోస‌మే వీళ్లిద్ద‌రూ క‌లిసి షూటింగ్‌లో పార్టిసిపేట్ చేస్తారు.
ఆల్రెడీ మ‌హేష్ అండ్ త‌మ‌న్నా క‌లిసి ఆగ‌డు సినిమా చేశారు. స‌రిలేరు నీకెవ్వ‌రులో పార్టీ సాంగ్కి కూడా స్టెప్పులేసింది త‌మ‌న్నా. సో ఇప్పుడు థ‌ర్డ్ టైమ్ వీళ్లిద్ద‌రూ క‌లిసి క‌నిపించ‌బోతున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz