close
Choose your channels

సుధీర్ బాబు: పుష‌ప్‌... న‌డ‌క‌... టెన్ టైమ్స్!

Wednesday, September 18, 2019 • తెలుగు Comments

సుధీర్ బాబు: పుష‌ప్‌... న‌డ‌క‌... టెన్ టైమ్స్!

ప‌దిసార్లు పుష‌ప్‌లు, ప‌ది సార్లు న‌డ‌క‌, ప‌దిసార్లు పుష‌ప్‌లు, ప‌ది సార్లు న‌డ‌క‌, ప‌దిసార్లు పుష‌ప్‌లు, ప‌దిసార్లు న‌డ‌క‌... ఇదంతా ఒక్క సెట్టు. ఇలాంటివి ప‌ది రౌండ్లు  చేస్తే ఏదో ఎక్స‌ర్‌సైజ్ చేసిన‌ట్టు... ఇ....న్ని సార్లు పుష‌ప్‌లు, న‌డ‌క‌లు, రౌండ్లు చేస్తున్న హీరో సుధీర్‌బాబు. సినిమా సినిమాకూ ఎక్స‌లెంట్ ట్రాన్స్ ఫ‌ర్ మేష‌న్‌తో ప్రేక్ష‌కుల‌కు ఆశ్చ‌ర్యానికి గురిచేసే హీరో సుధీర్‌బాబు. పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. మ‌రోవైపు `వి` సినిమా కోసం కృషి చేస్తున్నారు. సుధీర్‌బాబు, నివేదా థామ‌స్‌, అదితీరావుహైద‌రీ, నాని కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం `వి`.

ఓ వైపు ఎన్ని సినిమాలున్నా, ఫిట్‌నెస్ విష‌యంలో మాత్రం సుధీర్‌బాబు ఎప్పుడూ వెన‌క‌డుగు వేయ‌రు. ఆయ‌న‌లోని ఆస‌క్తిని గ‌మ‌నించి ఆయ‌న ట్రైన‌ర్ జాఫ‌ర్ కూడా స‌రికొత్త టాస్క్ లు ఇచ్చి, ఆయ‌న‌తో ఫిట్‌నెస్ ట్రైనింగ్ చేయిస్తుంటారు. ఇందాక చెప్పుకున్న పుష‌ప్‌లు, న‌డ‌క రౌండ్‌లు సుధీర్ మంగ‌ళ‌వారం సాయంత్రం చేసిన‌వి. వాటిని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎగ్జైట్‌మెంట్ ఇన్ ది ఎక్స్ పెరిమెంట్స్... అని ఆయ‌న దానికి సంబంధించి పోస్ట్ చేశారు. ఆయ‌న ప‌క్క‌న ట్రెడ్‌మిల్ మీద నిదానంగా మ‌రో వ్య‌క్తి న‌డుస్తున్నారు.  `నా ప‌క్క‌న ట్రెడ్‌మిల్ మీద ఉన్న‌ది ఎవ‌రో చెప్పుకోండి చూద్దాం` అని సుధీర్ పోస్ట్ చేశారు. ఆయ‌న ప‌క్క‌న ట్రెడ్ మిల్ మీద వ‌ర్క్ చేస్తున్న వెన్నెల‌కిశోర్ అని అర్థ‌మైంది. ఈ విష‌యాన్ని ఆయ‌న అభిమానులు ప‌లువురు పోస్ట్ చేశారు. ప్ర‌తి సినిమాకూ ఎందుకు ఒళ్లు గుల్ల చేసుకుంటార‌ని కూడా కొంత‌మంది పాజిటివ్‌గానే అడిగారు. వాళ్లంద‌రికీ సుధీర్ ఇచ్చే స‌మాధానం ఏమై ఉంటుందో మ‌న‌కు ఊహ‌కు అంద‌నిదేం కాదు...

Get Breaking News Alerts From IndiaGlitz