close
Choose your channels

కేబినెట్, అసెంబ్లీ సరే.. కేంద్రం సంగతేంటి జగన్..!?

Monday, January 27, 2020 • తెలుగు Comments

కేబినెట్, అసెంబ్లీ సరే.. కేంద్రం సంగతేంటి జగన్..!?

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుకున్న పని జరిగి తీరాల్సిందే అన్నంతగా పట్టుబడతారన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే పలు కీలక, సంచలన.. ఊహించని నిర్ణయాలను తీసుకున్న జగన్ తాజాగా.. శాసన మండలిని రద్దు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంట్‌లో 22 మంది ఎంపీల బలమున్న వైసీపీకి.. శాసన మండలిలో మాత్రం అంతగా లేదు.. దీంతో పలు బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయి. మరీ ముఖ్యంగా మూడు రాజధానులు, ఇంగ్లీష్ మీడియం, ఎస్సీ-ఎస్టీ కమిషన్‌కు చెందిన బిల్లులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉండిపోయాయి. దీంతో మండలిలో అస్తమాను ప్రభుత్వానికి చుక్కెదురవుతోంది. అస్తమానూ ఇలా జరుగుతుండటంతో చేసేదేమీ లేక ‘శాసన మండలి’ ని రద్దు చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించారు.

కేంద్రంలో సంగతేంటి!?
ఇందులో భాగంగా రెండ్రోజులగా ఈ వ్యవహారంపై నిశితంగా నిపుణులు, న్యాయవాదులతో పలువురు ఉద్ధండులతో చర్చించిన జగన్.. మండలిని రద్దు చేయాలని ఫిక్సయ్యారు. ఇందులో భాగంగా సోమవారం నాడు కేబినెట్‌ సమావేశంలో ‘రద్దు’ను ఆమోదించింది. అనంతరం అసెంబ్లీలో దీనిపై వైఎస్ జగన్ తీర్మానం ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. అయితే ‘రద్దు’ను కేబినెట్, అసెంబ్లీ ఆమోదిస్తే సరిపోదు. ఈ ‘రద్దు’ వ్యవహారం కేంద్రం దాకా కూడా వెళ్లాలి. పార్లమెంట్‌ కూడా ఆమోదిస్తే నిమిషాల్లో పని జరిగిపోతుంది. వైసీపీకి 22 మంది సభ్యులున్నారు గనుక.. ఇటు పార్లమెంట్‌లో.. ఇటు రాజ్యసభలో.. అటు లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. ఆ తర్వాత రాష్ట్రతి ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. ఆ తర్వాతే ఈ బిల్లు ఆమోదం పొందుతుంది. అయితే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గ్రీన్ సిగ్నల్ ఉంటుందా!?
కాగా.. కేంద్రంతో జగన్ మంచి సంబంధాలే కలిగి ఉన్నారు. అయితే.. జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? లేదా అనేదానిపై ప్రస్తుతం అన్నీ అనుమానాలే. మరీ ముఖ్యంగా ఏపీలో బీజేపీకి ఉన్నది ఇద్దరు ఇద్దరే ప్రజా ప్రతినిధులు (ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ హోదా) ఉన్నారు. వారు కూడా ఎమ్మెల్సీలు మాత్రమే. జగన్ నిర్ణయాన్ని సమర్థించి.. ‘రద్దు’ను ఆమోదిస్తే మాత్రం ఆ ఇద్దరు కూడా మాజీలు అయిపోతారు. ఈ తరుణంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏంటో.!

Get Breaking News Alerts From IndiaGlitz