close
Choose your channels

అనూహ్యంగా భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

Tuesday, April 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అనూహ్యంగా భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

కొత్త ఎకనమిక్ ఇయర్ ప్రారంభం అయిన నాటి నుంచి స్టాక్ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. ఇది వరకే మార్కెటింగ్ చరిత్రలో ఎప్పుడూ కనివినీ ఎరుగని రీతిలో సెన్సెక్స్ రికార్డ్ బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్ మొదటి వారం నుంచి అదేజోరు కొనసాగుతోంది. మంగళవారం నాడు కూడా దేశీయ స్టాక్‌మార్కెట్లు అనూహ్యంగా లాభాల బాట పట్టాయి. మొదట తీవ్ర హెచ్చు తగ్గులమధ్య కన్సాలిడేట్‌ అవుతూ కొనుగోళ్లతో రీబౌండ్‌ అయ్యింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 239 పాయింట్లు లాభపడి 38,939కి పెరిగింది. నిఫ్టీ 67 పాయింట్లు పుంజుకుని 11,671 వద్ద స్థిరపడింది.

ఇదిలా ఉంటే.. ప్రభుత్వ బ్యాంకింగ్‌, ఆటో షేర్లలో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు ఊపందుకోవడంతో సూచీలు లాభాలతో కళకళలాడుతున్నాయి. మరోవైపు యస్ బ్యాంక్ (4.08%), టాటా మోటార్స్ (2.67%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.52%), బజాజ్ ఆటో (2.19%), కోల్ ఇండియా (2.12%) లాబాల బాట పట్టగా... ఏసియన్ పెయింట్స్ (-3.54%), ఇన్ఫోసిస్ (-0.95%), భారతీ ఎయిర్ టెల్ (-0.76%), బజాజ్ ఫైనాన్స్ (-0.48%), ఓఎన్జీసీ (-0.35%) నష్టాల పాలైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.