close
Choose your channels

నట విశ్వరూపానికి కేరాఫ్‌ కమల్‌హాసన్‌

Saturday, November 7, 2020 • తెలుగు Comments

నట విశ్వరూపానికి కేరాఫ్‌ కమల్‌హాసన్‌

క‌మ‌ల్‌హాస‌న్‌.. యూనివ‌ర్స‌ల్ స్టార్

ద‌క్షిణాది చ‌ల‌న చిత్ర రంగానికే కాదు.. ఎంటైర్ సినీ ఇండ‌స్ట్రీకి కూడా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. న‌టుడిగా, ర‌చ‌యిత‌గా, గాయ‌కుడిగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా..ఇలా సినీ ప‌రిశ్ర‌మ‌లోని 24 శాఖ‌ల‌పై ప‌ట్టున్న అతికొద్ది మంది స్టార్స్‌లో క‌మ‌ల్‌హాస‌న్ ఒక‌రు. విల‌క్ష‌ణ‌త‌కు న‌ట‌న‌లో ఆయ‌న భార‌తీయుడు, ప్ర‌యోగాల‌కు ఆయ‌నే నాయ‌కుడు. త‌న న‌ట‌నతో ద‌శావ‌తారాల‌కు ప్రాణ ప్ర‌తిష్ట చేసిన లోక నాయ‌కుడు. భార‌తదేశంలో పుట్టిన ఆస్కార్ స్థాయి న‌టుడు. వెండితెర‌పై విశ్వ‌రూపం చూపిన న‌ట క‌మ‌లం. త‌ను త‌ప్ప మ‌రొక‌రు న‌టించ‌లేరు.. కొన్ని పాత్ర‌ల్లో ఒదిగిపోలేరనేంత గొప్ప‌గా త‌న‌దైన ముద్ర వేసిన బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి. ఒక వ్యాఖ్యాత‌గా, రాజ‌కీయ నాయ‌కుడిగా ఇలా సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో విభిన్న‌మైన పాత్ర‌ల‌ను పోషించ‌డం ఆయ‌న‌కే చెల్లింది. త‌న జీజీవిత‌మంతా సినిమా రంగానికే అంకిత‌మైన అభిన‌యం క‌మ‌ల్‌హాస‌న్ సొంతం. కోట్లాది మంది అభిమానులు, వేల‌ల్లో స‌న్మానాలు.. వంద‌ల్లో అవార్డులు చెప్ప‌లేన‌న్ని రివార్డులు, మరెన్నో ప్ర‌శంస‌లు. ఇవ‌న్నీ ఒక‌రి సొంతం అంటే మాట‌లు కాదు. దాని వెనుక ఎంతో క‌షి దాగి ఉంది. ఎంత క‌ష్ట‌ప‌డినా త‌న‌కేం తెలియ‌ద‌నే పంథాలో ప్ర‌తిరోజూ నిత్యవిద్యార్థిలా నేర్చుకోవ‌డం ఆయ‌న నైజం. అందుకే వెండితెర‌పై తిరుగులేని న‌ట చ‌క్ర‌వ‌ర్తిగా రాణిస్తున్నారు క‌మ‌ల్‌.

బాల‌న‌టుడిగా రంగ‌ప్ర‌వేశం...

క‌ల‌త్తూరు క‌న్న‌మ్మ సినిమాతో బాల‌నటుడిగా చిత్ర సీమ‌లోకి అడుగు పెట్టారు క‌మ‌ల్‌హాసన్‌. తొలి చిత్రంలోనే న‌ట‌న‌తో ఆక‌ట్టుకుని ఏకంగా జాతీయ‌స్థాయి ఉత్త‌మ బాల‌న‌టుడు అవార్డును ఆయ‌న సొంతం చేసుకున్నారు. ఎంజీరామ‌చంద్ర‌న్‌, శివాజీ గ‌ణేష‌న్‌, జెమినీ గ‌ణేష‌న్ వంటి స్టార్స్‌తో బాల‌నటుడిగా న‌టించారు. హీరోగా పయ‌నం మొద‌లైన త‌ర్వాత న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు ద‌క్కించుకుంటూ వ‌స్తున్నారు. 16 వ‌య‌దినిలే సినిమా ఆయ‌న్ని న‌టుడిగా మ‌రో మెట్టు ఎక్కించింది. ఈ సినిమా నుండి క‌మ‌ల్ హాస‌న్ వెనుదిరిగి చూసుకోవాల్సిన ప‌నిలేకుండా పోయింది. చేతినిండా సినిమాల‌తో బిజీ అయ్యారు. ఈయ‌న్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ఆయ‌న గురువు కె.బాల‌చంద‌ర్‌కే ద‌క్కింది. ఈయ‌న తెర‌కెక్కించిన మ‌రో చరిత్ర క‌మ‌ల్ రేంజ్‌ను పెంచి స్టార్ స్టేట‌స్‌ను తెచ్చిపెట్ట‌డ‌మే కాదు.. ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో ఓ వేవ్‌ను క్రియేట్ చేసిందీ చిత్రం. క‌ల‌ర్ సినిమాల స‌మ‌యంలో వ‌చ్చిన ఈ బ్లాక్ అండ్ వైట్ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోయింది. హిందీలో ఈ సినిమాను ఏక్ తేజే కేలియా పేరుతో రీమేక్ చేస్తే బాలీవుడ్‌లోనూ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్స్ సునామీని స‌ష్టించింది. న‌టుడ‌న్న త‌ర్వాత వైవిధ్య‌మైన పాత్ర‌లు చేయాల‌నే సిద్ధాంతానికి క‌మ‌ల్ ఎప్పుడూ క‌ట్టుబ‌డ్డారు. డిఫ‌రెంట్ రోల్స్‌, సినిమాలు అయ‌న్ని వెతుక్కుంటూ వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో విడుదలైన ఆక‌లిరాజ్యం. ఈ సినిమాలో క‌మ‌ల్‌హాస‌న్‌, శ్రీదేవి జంట‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. ఆ త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన వ‌సంత కోకిల మ‌రోసారి సినీ ఇండ‌స్ట్రీలో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో న‌ట‌న‌కు క‌మ‌ల్‌హాస‌న్ జాతీయ‌స్థాయి అవార్దుని ద‌క్కించుకున్నారు. అలాగే మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్‌హాస‌న్ చేసిన నాయ‌కుడు సినిమా గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. ఇండియ‌న్ సినిమాల్లో ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయిందీ చిత్రం. ఇప్ప‌టికీ ఇంట‌ర్నేష‌న‌ల్ యాక్టింగ్‌స్కూల్స్‌లో ఈ చిత్రాన్ని ఓ పాఠంగా చెబుతారంటే ఈ సినిమా ఎంత మేర‌కు ప్ర‌భావం చూపిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక పుష్ప‌కవిమానం గురించి చెప్పాలంటే ఓ అధ్యాయం అనొచ్చు. ఎందుకంటే సినిమాల‌న్నీ క‌మ‌ర్షియ‌ల్ పంథాల్లో ఫైట్స్‌, డాన్సులు, డైలాగ్స్ అని దూసుకుపోతున్న స‌మ‌యంలో ఎలాంటి డైలాగ్స్ లేకుండా సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్‌హాస‌న్ చేసిన పుష్ప‌క‌విమానం తిరుగులేని ఎక్స్‌పెరిమెంట్‌. ఇలా ఎక్స్‌పెరిమెంట్స్ ప‌రంగా ఆయ‌నకు ఆయ‌నే సాటి అనేంత గొప్ప సినిమాలెన్నింటిలోనో క‌మ‌ల్‌హాస‌న్ న‌టించారు. ఇక క‌మ‌ర్షియ‌ల్ సినిమాల విష‌యానికి వ‌స్తే..

నట విశ్వరూపానికి కేరాఫ్‌ కమల్‌హాసన్‌

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లోనూ ప్ర‌యోగాల‌కు పెద్ద పీట వేస్తూ ఈయ‌న న‌టించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రాలెన్నో.. అలాంటి వాటికి ఓ బెస్ట్ ఎగ్జాంపుల్ భార‌తీయుడు. లంచం అనే అంశంపై డెబ్బై ఏళ్లు స్వాతంత్ర్య వీరుడు పోరాడిన విధం.. దాన్ని ద‌ర్శ‌కుడు శంక‌ర్ తెర‌కెక్కించిన తీరు, ఒక ప‌క్క ముస‌లాడిగా, మ‌రో వైపు కొడుకు క‌మ‌ల్‌హాస‌న్‌గా రెండు పాత్ర‌ల‌ను క్యారీ చేసిన విధానం చూస్తే ఎవ‌రికైనా ఇలాంటి సినిమాల్లో క‌మ‌ల్‌త‌ప్ప మ‌రొక‌రు న్యాయం చేయ‌లేరు అనేంత గొప్ప‌గా ఒదిగిపోయారు. ఆ సినిమాలో క‌మ‌ల్ న‌టన‌కు జాతీయ అవార్డు సొంత‌మైది. అలాగే కె.విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్‌హాస‌న్ న‌టించిన సాగ‌ర సంగ‌మం తెలుగు సినీ గ‌మ‌నంలో ఓ మైలురాయిగా నిలిచిపోయింద‌న‌డంలో సందేహం లేదు. ఈ సినిమా కూడా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన స్వాతి ముత్యం కూడా ఓ ట్రెండ్ సెట్టింగ్ మూవీగా నిలిచిపోయింది. మ‌న దేశం త‌ర‌పున ఆస్కార్ అవార్డుల రేసుకు వెళ్లిన చిత్రంగా అప్ప‌ట్లో టాక్ ఆఫ్ ఇండ‌స్ట్రీ అయ్యిందంటే కార‌ణం టైటిల్ పాత్ర‌లో క‌మ‌ల్ చేసిన న‌ట విశ్వ‌రూప‌మే. ఈ సినిమాకు నంది అవార్డుతో పాటు జాతీయ ఉత్త‌మ చిత్రం అవార్డు కూడా ద‌క్కించుకుంది. ఇలా చెప్పుకుంటే పోతే ఇంద్రుడు చంద్రుడు, విచిత్ర సోద‌రులు, గుణ‌, భామ‌నే స‌త్య‌భామ‌నే, క్ష‌త్రియ‌పుత్రుడు, మ‌హాన‌ది, తెనాలి, పంచ‌తంత్రం, ద్రోహి, బ్ర‌హ్మ‌చారి, ద‌శావ‌తారం, ఈనాడు .. ఇలా ఎన్నెన్నో చిత్రాలున్నాయి ప్ర‌తి సినిమా దేనిక‌దే ప్ర‌త్యేకం. ప్ర‌తిపాత్ర దేనిక‌దే వైవిధ్యం. విచిత్ర‌సోద‌రుల్లో క‌మ‌ల్‌హాస‌న్ రెండు పాత్ర‌ల్లో న‌టించారు. అందులో పొట్టివాడుగా ఎలా న‌టించాడ‌నేది ఇప్ప‌టికీ సీక్రెట్టే. త‌ర్వాత మైకేల్ మ‌ద‌న‌కామ‌రాజు చిత్రంలో నాలుగు పాత్ర‌ల్లో అల‌రించారు. అలాగే ద‌శావ‌తారం చిత్రంలో అయితే ప‌ది పాత్ర‌ల్లో మెప్పించారు. క‌మ‌ల్ హాస‌న్ చిత్రమంటే అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ క్రేజే.

ఒకవైపు బిగ్‌బాస్‌ హోస్ట్‌గా, రాజకీయ నాయకుడిగా బిజీ బిజీగా ఉంటున్న కమల్‌ హాసన్‌ .. మరో వైపు సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం లొకేష్‌ కనకరాజ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. నటుడిగా కెరీర్‌నుస్టార్ట్‌చేసి సినీ పరిశ్రమలోని శాఖలన్నింటిపై పూర్తి అవగాహన ఉన్న అతి కొద్ది మంది స్టార్స్‌లో కమల్‌హాసన్‌ ఒకరు. మన ఇండియన్‌ సినిమాకు గర్వకారణంగా నిలుస్తున్న కమల్‌ ఇలాంటి పుట్టినరోజులను ఎన్నింటినో సెలబ్రేట్‌ చేసుకోవాలని కోరుకుంటూ
............హ్యాపీ బర్త్‌డే టు కమల్‌హాసన్‌...............

Get Breaking News Alerts From IndiaGlitz