close
Choose your channels

Rashmika:సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఉంది.. రష్మిక వ్యాఖ్యలు వైరల్..

Monday, January 29, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రష్మిక మందన్న.. నేషనల్ క్రష్‌గా ఫుల్ పాపులారింటీ దక్కించుకున్నారు. 'పుష్ప' సినిమాతో బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా స్థిరపడ్డారు. ఇక ఇటీవల వచ్చిన 'యానిమల్' సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాందించుకున్నారు. దీంతో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. దాదాపు అరడజను సినిమాలు ఈ అమ్మడు చేతిలో ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయోపిక్ చిత్రం చేయాల్సి వస్తే ఎవరి పాత్రలో నటిస్తారనే ప్రశ్న రష్మికకు ఎదురైంది. ఇందుకు ఆమె సమాధానమిస్తూ "నేను ఇండస్ట్రీకి రాకముందు మా నాన్న నేను కొంచెం సౌందర్య గారిలా ఉన్నాను అనేవారు. ఒకవేళ నేను అలాగే ఉన్నాను అనిపిస్తే సౌందర్య గారి బయోపిక్‌లో నటించాలని ఉంది. ఆమె జర్నీ అంటే నాకు చాలా ఇష్టం" అని చెప్పకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

దీంతో మరోసారి సౌందర్య బయోపిక్ చర్చగా మారింది. గతంలోనే సౌందర్య జీవితాన్ని బయోపిక్‌గా తెరకెక్కిస్తామనే పలు వార్తలు వచ్చాయి. అయితే అవి వార్తలగానే మారాయి కానీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఏకంగా స్టార్‌ హీరోయిన్ అయిన రష్మిక సౌందర్య బయోపిక్‌లో నటించడానికి రెడీగా ఉన్నానని స్టేట్‌మెంట్ ఇచ్చారు. మరి ఎవరు ఆమె బయోపిక్ తెరకెక్కి్స్తారో చూడాలి. ఒకవేళ సౌందర్య బయోపిక్ తీస్తే మాత్రం ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో మైలురాయి చిత్రంగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు.

మహానటి సావిత్రి తర్వాత హీరోయిన్‌గా అంత పేరు దక్కి్ంచుకున్నారు సౌందర్య. అయితే ఇద్దరు తక్కువ వయసులోనే అర్థాంతరంగా చనిపోయారు. 1992 నుంచి 2003 వరకు దాదాపు 11 సంవత్సరాలు తెలుగు, తమిళ్, కన్నడ పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. తన నటన, వ్యక్తిత్వంతో ఎంతో మంది అభిమానులను పొందారు. ఏ పాత్రైనా అలవోకగా పోషించేవారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం ప్రేక్షకులకు దూరం చేసింది. 2004లో ఓ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు హెలికాఫ్టర్‌లో వెళ్తుండగా.. సాంకేతిక సమస్యలు తలెత్తి ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. దీంతో చిత్ర పరిశ్రమ, అభిమానులకు తీరని లోటు ఏర్పడింది.

సౌందర్య మరణించి 20 సంవత్సరాలు అవుతున్నా తన నటన ద్వారా కళ్ల ముందే కదిలాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆమె బయోపిక్ వస్తే.. అందులో రష్మిక లాంటి హీరోయిన్ నటిస్తే ఓ మైలురాయి చిత్రంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. సౌందర్య పాత్రలో రష్మిక కరెక్ట్‌గా సెట్ అవుతారని అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం వెండితెర పైకి వస్తుందో లేదో తెలియాలంటే వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.