ఇన్ని సవాళ్లు.. ఇదే తొలిసారి: చంద్రబాబు


Send us your feedback to audioarticles@vaarta.com


చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి కొత్తేం కాదు. సవాళ్లు కూడా కొత్త కాదు. నిజానికి సవాళ్లను తనకు అనుకూలంగా మార్చుకొని సత్ఫలితాలు సాధించడం ఈయనకు అలవాటు. ఛాలెంజెస్ స్వీకరించి సాధించి చూపిస్తారాయన. ఇలాంటి వ్యక్తి తొలిసారి తనకు చాలా సవాళ్లు ఎదురయ్యాయని చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఆంధ్రప్రదేశ్ కు మరోసారి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న చంద్రబాబు.. ఈ టర్మ్ లో తన 9 నెలల పదవీ కాలాన్ని పూర్తిచేస్తున్నారు. ఈ 9 నెలల పాలనపై స్పందించిన చంద్రబాబు.. తన హయాంలో చాలా సమస్యలు, సవాళ్లు ఎదుర్కొన్నానని.. కానీ ఈసారి మాత్రం విపరీతమైన సవాళ్లు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించారు.
ఐదేళ్లు నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నానని, ఈ క్రమంలో ఇన్ని సవాళ్లు ఎదురుకావడం తన జీవితంలో ఇదే తొలిసారని అంటున్నారు ముఖ్యమంత్రి. దీన్ని బట్టి వ్యవస్థలు ఎంత నిర్వీర్యమయ్యాయో అర్థం చేసుకోవచ్చన్నారు.
స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, 15 శాతం వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అంటున్నారు చంద్రబాబు. అందుబాటులో ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకొని, సుస్థిరత సాధించడంతో పాటు, అప్పులు కూడా తీర్చాల్సిన అవసరం ఉందన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com