లాస్ట్ మినిట్‌లో టూర్ రద్దు.. లంక పేలుళ్లలో శివాజీ రాజా ఫ్రెండ్ మృతి!
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లలో ఇప్పటికే 292 మందికిపైగా మృతి చెందగా.. అంతకు రెట్టింపు మంది క్షతగాత్రులయ్యారు. మరోవైపు భారతీయులు, ఇండియాలో ఉన్న వారి మిత్రులు కొందరు ఈ మారణహోమంలో కన్నుమూశారు. కాగా ఇప్పటికే పలువురు అనంతపురం వాసులు, కర్ణాటకలోని జేడీఎస్‌కు చెందిన ఐదుగురు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్ సురక్షితంగా బయటపడ్డ సంగతి తెలిసిందే. అయితే ఈ మారణహోమం అనంతరం ఎవరెవరు.. మనవాళ్లు అక్కడ చనిపోయారనేది ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి.
టాలీవుడ్ ప్రముఖ నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా మిత్రుల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం మీడియాకు వివరిస్తూ శివాజీ కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా.. తాను కూడా స్నేహితులతో కలిసి శ్రీలకంకు వెళ్లాల్సి ఉంది.. కానీ చివరి నిమిషంలో పర్యటన రద్దు చేసుకున్నానని ఆయన కంటతడి పెడుతూ మీడియాకు వివరించారు.
చనిపోయిందెవరు..!?
హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన మిత్రుడు మాకినేని శ్రీనివాసబాబు తాను మంచి మిత్రులమని.. మా ఇద్దరికీ ట్రావెలింగ్ బాగా ఇష్టమన్నారు. ఇప్పటికే మేమిద్దరం కలిసి సుమారు 35 దేశాలు తిరిగొచ్చామన్నారు. ఇప్పటికే ఓ సారి శ్రీలంక వెళ్లామని.. మళ్లీ వెళ్దామని అనుకుంటుండగా చివరి నిమిషంలో తాను టూర్ రద్దు చేసుకోవడంతో.. శ్రీనివాస్ ఆయన కజిన్ తులసీరాంతో కలిసి శ్రీలంక వెళ్లారని.. ఇటీవల జరిగిన బాంబు పేలుళ్లలో తులసీరామ్ ప్రాణాలు కోల్పాయడని.. శ్రీనివాసబాబు తీవ్ర గాయాలయ్యాయని శివాజీ రాజా తీవ్ర ఆవేదనతో చెప్పారు. అయితే గాయాలపాలైన శ్రీనివాస రెండ్రోజుల్లో హైదరాబాద్‌కు వస్తారని.. తులసీరామ్ మృతదేహం కూడా స్వదేశానికి వస్తుందన్నట్లుగా శివాజీ చెప్పుకొచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments