close
Choose your channels

శ్రుతి కోరిక తీరింది...

Sunday, July 23, 2017 • తెలుగు Comments

కమల్ తనయ శ్రుతి హాసన్ ఓ షూటింగ్ చిత్రీక‌ర‌ణ కోసం చండిగ‌ఢ్ వెళ్లింది. తీరా అక్క‌డ‌కు వెళ్లాక త‌ను చిన్న‌నాటి కోరిక‌ను తీర్చేసుకుంది. ఇంత‌కు ఆ కోరిక ఏంటంటారా? స‌్వ‌ర్ణ దేవాల‌యం చూడట‌మే. అమృత‌స‌ర్‌లో కొలువైన స్వ‌ర్ణ దేవాల‌యాన్ని సంద‌ర్శించాల‌ని శ్రుతిహాస‌న్‌కు చిన్న‌ప్ప‌టి నుండి కోరిక‌ట‌.

కానీ ఇన్ని రోజులు కుద‌ర‌లేదు. ఎట్ట‌కేల‌కు ఇప్ప‌టికి త‌న కోరిక తీరింద‌ని శ్రుతి సంతోషాన్ని వ్య‌క్తం చేసింది. ఇన్నాళ్ల‌కు స్వ‌ర్ణ దేవాల‌యానికి రావ‌డం మ‌న‌సుకు ఎంతో హాయిగా ఉంది. ఆనందాన్ని మాట‌ల్లో వ‌ర్ణించ‌లేను. నిర్వాహ‌కులు అతిథ్యం, మ‌ర్యాద‌లు ఎంతో ఆక‌ట్టుకున్నాయని ఈ సంద‌ర్భంగా శ్రుతి తెలిపారు. ప్ర‌స్తుతం శ్రుతి న‌టిస్తున్న యాత్ర సినిమా అక్టోబ‌ర్‌లో విడుద‌ల కానుంది.

Get Breaking News Alerts From IndiaGlitz