రఘురామకృష్ణంరాజు షోకాజ్ నోటీసు జారీ.. స్పందించిన ఎంపీ


Send us your feedback to audioarticles@vaarta.com


ఎమ్మెల్యేలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. వైసీపీ తరుఫున పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈ నోటీసును జారీ చేశారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడటంతో పాటు.. అధినాయకత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలను షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలకు వారం లోగా సమాధానం ఇవ్వకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
తనకు పంపిన షోకాజ్ నోటీసుపై రఘురామ కృష్ణంరాజు స్పందించారు. తనకు షోకాజ్ నోటీసు అందిందని.. 18 పేజీలలో రెండు పేజీలు మాత్రమే నోటీసుకు సంబంధించిన అంశాలని.. మిగిలినవి వివిధ పత్రికల క్లిప్పింగ్స్ అని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. తాను ప్రభుత్వం చేపట్టిన లోపాల గురించి మాత్రమే ప్రస్తావించానని.. పార్టీని కానీ జగన్ను కానీ విమర్శించలేదన్నారు. రేపే విజయసాయిరెడ్డికి వివరణ పంపిస్తానన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.