close
Choose your channels

Bigg Boss 7 Telugu : యావర్ తెచ్చిన తంటా, శివాజీతో శోభాశెట్టి గొడవ .. వింత అవతారాల్లో కంటెస్టెంట్స్

Friday, September 29, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 7 ఈసారి మామూలుగా వుండదని గత ఎపిసోడ్లకు భిన్నంగా వుంటుందని నాగార్జున్న చెప్పారు. ఉల్టా పల్టా అంటూ ఏదో అన్నారు. అందుకు తగినట్లుగానే నామినేషన్స్‌తో పాటు కొన్ని విధానాలు మార్పులు కనిపిస్తున్నాయి. టాస్కులు కూడా కొత్తగా ట్రై చేస్తున్నారు. అయితే గురువారం ఇచ్చిన టాస్క్.. చేసేవాళ్లకే కాదు, చూసేవాళ్లకు కూడా వింతగా అనిపించింది. ప్రస్తుతం ఇంట్లో శివాజీ, సందీప్, శోభాశెట్టిలు పవర్ అస్త్రను సంపాదించి హౌస్‌మేట్స్‌గా స్థానం సంపాదించారు. ఈ దశలో నాలుగో పవర్ అస్త్ర కోసం బిగ్‌బాస్ టాస్క్‌లు ఇస్తున్నాడు. దీనిలో భాగంగా గురువారం ఇచ్చిన టాస్క్ భయపెట్టింది. కంటెస్టెంట్లు కన్నీళ్లు చూపించి.. ఆ నీటితో గ్లాస్ నింపాలని ఆదేశించారు.

పవర్ అస్త్ర టాస్క్‌లో భాగంగా కాయిన్స్ సౌండ్ వినిపించినప్పుడల్లా కంటెస్టెంట్స్ అంతా పరిగెత్తుకుంటూ వెళ్లి ఏటీఎం దగ్గర వున్న బజర్ ప్రెస్ చేయాలి. ఎవరైతే ముందుగా బజర్ నొక్కితే, వారికే ఆ టాస్క్ ఆడే అవకాశం వుంటుంది. బిగ్‌బాస్ కాయిన్స్ శబ్ధం చేయగానే.. యావర్ ముందుగా వచ్చి బజర్ క్లిక్ చేసి ప్రశాంత్‌ను తన పార్ట్‌నర్‌గా ఎంచుకున్నాడు. తమతో పోటీపడేందుకు గౌతమ్, అమర్‌దీప్‌లు కావాలని చెప్పాడు. దీని వెనుక యావర్ స్ట్రాటజీ వుంది. గౌతమ్, అమర్‌ల దగ్గర ఎక్కువ కాయిన్స్ వున్నాయి. బిగ్‌బాస్ పెట్టే టాస్క్‌లో వీరిద్దరూ ఓడిపోతే ఆ కాయిన్స్ సొంతం చేసుకోచ్చని యావర్ స్కెచ్.

అనంతరం బిగ్‌బాస్ వీరికి కన్నీళ్లతో గ్లాస్ నింపే టాస్క్ ఇచ్చారు. దీంతో అమర్‌, గౌతమ్‌లు కన్నీళ్లు తెప్పించేందుకు గాను ఉల్లిపాయలు, నిమ్మకాయలు పిండుకున్నారు. వీరికి పోటీగా ప్రశాంత్, యావర్‌లు కిందపడి ఎడవటం మొదలుపెట్టారు. అసలే ఏడవటంలో పల్లవి ప్రశాంత్‌కు మాస్టర్ డిగ్రీ వుంది. తనకు ఏడవటం ఎంత అలవాటో అతని వీడియోలు చూస్తేనే తెలుస్తుంది. చివరికి ప్రశాంత్-యావర్‌లు ఈ టాస్క్‌లో విజయం సాధించారు. 118 కాయిన్స్‌తో యావర్, 110 కాయిన్స్‌తో ప్రశాంత్‌లు నాలుగో పవర్ అస్త్ర కోసం అర్హత సాధించారు.

ఇవాళ శివాజీ, శోభాశెట్టి మధ్య గొడవ హైలెట్‌గా నిలిచింది. గురువారం కంటెస్టెంట్స్ అంతా కిచెన్‌లో భోజనం చేస్తుంటే.. యావర్ , ప్రశాంత్ మాత్రం బజర్‌ని అందరికంటే ముందు ప్రెస్ చేయాలనే ఉద్దేశంతో దాని దగ్గరే కూర్చొన్నారు. తాను లేస్తే ఛాన్స్ మిస్ అవుతుందన్న ఉద్దేశంతో శివాజీని చపాతీలు తీసుకురమ్మన్నాడు. దీనికి సందీప్‌కు కోపం వచ్చింది. బజర్ దగ్గర తింటే అది స్వార్ధం అవుతుందని.. ఇది మంచిది కాదని యావర్‌కు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. ఇద్దరికి మాటా మాటా పెరిగి యావర్ ప్లేట్‌ని అక్కడే విసిరేసి వెళ్లిపోయాడు. ప్రియాంక కూడా యావర్‌తో వాదించింది.

కానీ శివాజీ మాత్రం యావర్‌కు సపోర్ట్‌గా మాట్లాడాడు. ఇంత చిన్న దానికి ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించాడు. దీంతో శివాజీ, శోభాశెట్టిల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఈ ఇంట్లో అలాంటి ఉద్దేశం ఎవరికీ లేదని, మీకు మాత్రమే ప్రతిదానిని గొడవ చేయాలని వుంటుందని శివాజీకి వార్నింగ్ ఇచ్చినంత పని చేసింది. టాస్క్‌లు పూర్తయిన తర్వాత ఎల్లో శారీలో శోభాశెట్టి అందాల ప్రదర్శన చేసి కనువిందు చేసింది. బీబీ గాలా నైట్ కోసం కంటెస్టెంట్స్‌ ఇంట్లో వున్న వస్తువులు, కాస్ట్యూమ్స్‌తో రెడీ అయ్యారు. ప్రియాంక అయితే దెయ్యం పిల్లలా భయపెట్టింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.