close
Choose your channels

కొత్త షెడ్యూల్‌లో శ‌ర్వానంద్ 'శ్రీకారం'

Wednesday, November 13, 2019 • తెలుగు Comments

కొత్త షెడ్యూల్‌లో శ‌ర్వానంద్ శ్రీకారం

శ‌ర్వానంద్ హీరోగా రూపొందనున్న చిత్రం `శ్రీకారం`. 14రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై కిషోర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ ఏడాది ఆగ‌స్ట్ నుండి సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. తాజాగా కొత్త షెడ్యూల్‌ను చిత్ర యూనిట్ స్టార్ట్ చేసింది. తిరుప‌తి స‌మీపంలోనే పంట‌పొలాల్లో కొత్త షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను స్టార్ట్ చేసిన‌ట్లు చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.  ఈ సినిమాలో శ‌ర్వానంద్ రైతు పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సంక్రాంతికి సినిమాను విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే విడుద‌ల తేదీపై నిర్మాత‌లు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం చేయ‌లేదు. అలాగే ఈ చిత్రంలో శ‌ర్వానంద్ స‌ర‌స‌న న‌టించ‌బోయే హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై క్లారిటీ లేదు. నానితో `గ్యాంగ్ లీడ‌ర్‌`లో క‌లిసి న‌టించిన ప్రియాంక అరుల్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని వార్త‌లు వినిపంచాయి. ఈ సినిమాలో శ‌ర్వానంద్ రైతుగా న‌టిస్తున్నాడంటే సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంటుంద‌ని తెలుస్తుంది. మ‌రి ఈ చిత్రంతో శ‌ర్వానంద్ ఎలాంటి మెసేజ్ ఇస్తాడో వేచి చూడాలి.

శ‌ర్వానంద్ త‌మిళ చిత్రం `96` తెలుగు రీమేక్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేశారు. ఇందులో స‌మంత హీరోయిన్‌గా న‌టించారు. ఇప్పుడు `శ్రీకారం`ను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఈ యువ క‌థానాయ‌కుడు గ‌త రెండు చిత్రాలు ర‌ణ‌రంగం, ప‌డి ప‌డి లేచె మ‌న‌సు చిత్రాలు బాక్సాఫీస్ బోల్తాప‌డ్డాయి. ఈ క‌మ్రంలో శ‌ర్వానంద్ మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. 

 
 

Get Breaking News Alerts From IndiaGlitz